బూట్లపై 'ఓం' గుర్తు... పాకిస్థాన్‌లో వ్యాపారుల దుశ్చర్య.. నిరసన తెలుపుతున్న హిందువులు
పాకిస్థాన్‌లో హిందువుల దేవతా చిహ్నంగా పూజిస్తున్న 'ఓం' ను షూలపై ముద్రించి వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలు కలకలం సృష్టిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తూ.. రోజు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున
పాకిస్థాన్‌లో హిందువుల దేవతా చిహ్నంగా పూజిస్తున్న 'ఓం' ను షూలపై ముద్రించి వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలు కలకలం సృష్టిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తూ.. రోజు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న అక్కడ మైనారిటీలుగా ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న హిందువులు ఇప్పుడు తమ మనోభావాలకు భంగం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
జేబ్ షూస్ అనే సంస్థ వాటిని సింథ్ ప్రాంతంలో అమ్ముతుండగా అక్కడి వారు అడ్డు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో అక్కడ షాపింగ్ జోరుజోరుగా సాగుతుంది. కాగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ షూల వ్యాపారంపై నోరుమెదపలేని కఠిన పరిస్థితి హిందువులకు ఏర్పడింది. అయితే విషయం తెలుసుకున్న 'పాకిస్థాన్ హిందూ కౌన్సిల్' ప్రతినిధి రమేష్ కుమార్ రంగంలోకి దిగి.. సింథ్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
ప్రస్తుతం ఓం గుర్తుతో ఉన్న షూల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓం గుర్తుతో ఉన్న షూల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, వీటిని తక్షణం దుకాణాల నుంచి తొలగించాలని పాక్ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 'పాకిస్థాన్ హిందూ కౌన్సిల్' ఈ విషయంపై అందరికి అవగాహన కలిగేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లను పెట్టి, వాటిని షేర్ చేయాలంటూ కోరుతున్నారు.