Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లా టూర్

Advertiesment
chandrababu naidu

ఠాగూర్

, శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (09:29 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తలపెట్టిన శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయింది. అదేసమయంలో ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దు కావడానికి కారణాలు తెలియరాలేదు. 
 
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో శుక్రవారం చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 
 
ఈ క్రమంలో భాగంగా తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ఒక పక్క శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు కావడంతో ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదు నగరాలకు విస్తరించిన అల్ట్రా వయొలెట్