Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రి కరెంటు తీసి సంసారం కూడా సరిగా చేయనీయలేదు కాంగ్రెస్... చంద్రబాబు ధ్వజం

రాత్రిపూట కరెంటు కోతలు పెట్టి సంసారం కూడా సరిగా చేయనీయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో

Advertiesment
ap cm chandrababu naidu speech
, శనివారం, 18 మార్చి 2017 (17:23 IST)
రాత్రిపూట కరెంటు కోతలు పెట్టి సంసారం కూడా సరిగా చేయనీయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత కష్టాల్లోకి నెట్టబడింది. తెలంగాణలో ఆదాయం ఎక్కువ, జనభా తక్కువ. అందుకే అక్కడ ఆర్థిక ఇబ్బందులు లేవు. మన ఏపీలో జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. అందుకే మనకు ప్రస్తుతం కష్టాలు. ఐతే ఈ కష్టాలనే అవకాశంగా తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. 
 
త్వరలో రైతులకు డిజిటల్ సౌకర్యాలు కల్పిస్తాం. ఇంట్లో కూర్చుని కరెంటు స్విచ్ వేస్తే పొలంలో నీళ్లు ప్రవహించే పరిస్థితి తీసుకొస్తా. రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తా. అప్పట్లో నేను నేను దీపం పెట్టాను, కాంగ్రెస్ పార్టీ వాళ్లు వచ్చి దీపం ఆర్పేశారు. నా తల్లిని చూశా, గ్యాస్ లేదు, కట్టె పుల్లలతో వంట చేసేది. కంటి నిండా నీళ్లు వచ్చేవి. ఆ పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడిని. అందుకే ఆ పరిస్థితి ఏ ఆడబిడ్డకూ లేకుండా చేయాలని సంకల్పించాను. జూన్ 2 లోపల నూటికి నూరు శాతం వంట గ్యాస్ స్టవ్‌లు ఇప్పిస్తాను.
 
మరుగుదొడ్డి మన అందరి హక్కు. మరుగుదొడ్డి వాడనివాడు మనిషే కాదు నా దృష్టిలో. కొంతమందికి కోపం రావచ్చు. కానీ మన పరిసరాల పరిశుభ్రత మన చేతుల్లోనే వుంది. 2018 లోపల ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి వాడాలి. రూ. 15,000 ఇస్తున్నాను, కట్టుకోండి. అలాగే సొంత ఇంట్లో వుండాలనే కల అందరికీ వుంటుంది. అద్దె ఇంట్లో వద్దనుకుంటాం. తిండి తర్వాత ఇల్లే కదా... రాబోయే రెండున్నర సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టిస్తాను. భవిష్యత్తులో పూరి గుడెసె లేకుండా చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పని అయిపోయినట్టేనా?