Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పని అయిపోయినట్టేనా?

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. 'ప్రేమమ్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు నటించింది కేవలం మూడు చిత్రాలే అయినప్పటికీ యూత్‌లో మంచి క

'ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పని అయిపోయినట్టేనా?
, శనివారం, 18 మార్చి 2017 (17:13 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. 'ప్రేమమ్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు నటించింది కేవలం మూడు చిత్రాలే అయినప్పటికీ యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. 
 
'శతమానం భవతి' హిట్ కావడంతో అనుపమకి మెగా హీరో రాంచరణ్ - సుకుమార్ కాంబోలో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. దాంతో ఇక అనుపమ టాప్ హీరోయిన్ అయిపోతుందని భావించారు. కానీ, చివరి నిమిషంలో అనుపమని తప్పించి సమంతని ఫిక్స్ చేయడంతో ఈ బ్యూటీకి ఊహించని షాక్. 
 
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోదామనుకున్న అనుపమకి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు ఛాన్స్ కూడా లేదు. చెర్రీ సినిమా కోసం అనుపమ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, అందుకే ఆమెని తప్పించారని అప్పట్లో రూమర్ వచ్చినప్పటికీ చివరు దర్శకుడు సుకుమార్ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. మొత్తంమీద అనుపమ పరమేశ్వరన్ ఇపుడు ఇంటికే పరిమితమైపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రాజధాని... సీఎం చంద్రబాబు బురదలో కాలువేసినట్లుందా?