Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

Advertiesment
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:10 IST)
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరి కొందరిపై.. ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది.

దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. 
 
దీంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈకేసుకు సంబంధించి హైకోర్టులో గత నెలరోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది.

దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులను కొట్టేసింది.

అలాగే ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మళ్లీ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు