చిన్నారులపై లైంగిక దాడుల సంఘటనలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన అనిల్ (20) అనే యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో ఈ దుర్ఘటన వెలుగు చూసింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి అనిల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో అమ్మమ్మ వద్ద ఉంటున్నఈ చిన్నారులను కామాంధుడు మేడపైకి ఎత్తుకెళ్ళాడు. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇతడు గత కొద్ది రోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బి.కొత్తకోట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.