Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనాడు ఎన్టీఆర్‌కు జరిగింది నేడు నాగిరెడ్డికి జరుగుతోందా.. ఈ శవ రాజకీయాలు ఎన్నాళ్లు?

బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయాకా ఎన్‌టీ రామారావుకు ఏం జరిగిందో దివంగత భూమా నాగిరెడ్డికి కూడా నేడు అదే జరుగుతోందా?. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకు రాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణిస్తే అభ్యర్ధుల జాబితా నుండి ఆమె పేరు తొలగించాలని ఎన్నికల సంఘానికి పిట

Advertiesment
cheating tragedy
హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (03:13 IST)
బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయాకా ఎన్‌టీ రామారావుకు ఏం జరిగిందో దివంగత భూమా నాగిరెడ్డికి కూడా నేడు అదే జరుగుతోందా?. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకు రాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణిస్తే అభ్యర్ధుల జాబితా నుండి ఆమె పేరు తొలగించాలని ఎన్నికల సంఘానికి పిటిషన్లు పెట్టిన వారు, విభజనానంతర ఏపీ తొలి శాసనసభలో ఆమెకు కనీసం సంతాపం తెలపడానికైనా ఇష్టపడని వారు, నాగిరెడ్డిని అడ్డగోలు కేసుల్లో ఇరికించి ఆస్పత్రుల పాలు చేసి, చివరకు జైలుకు కూడా పంపిన పార్టీకి చెందినవారు..  ఆయన చనిపోయాక ఆ కుటుంబం మొత్తం తమదేనని ప్రకటించుకునే ప్రయత్నం చెయ్యడాన్ని మించిన శవ రాజకీయం ఇంకొకటి ఉంటుందా?. వయసులో, అనుభవంలో చిన్న కాబట్టి అఖిలప్రియకు ఇంకా ఈ విషయం అర్థం కాకపోవచ్చు, మోహన్‌రెడ్డికయినా తెలియకుండా ఉంటుందా?
 
నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ చెప్పి పార్టీ ఫిరాయించేటట్టు చేసిన చంద్రబాబు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారని ఇవ్వాళ నాగిరెడ్డి సోదరి విలపిస్తున్నారు. గుండె జబ్బుతో రెండు సార్లు ఆపరేషన్లు చేయించుకున్న మనిషి విజయవాడకు వచ్చి కలిస్తే దీర్ఘకాలం ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థిని ఎంఎల్‌సీగా గెలిపించి తీసుకురా అప్పుడు మాట్లాడదాం అని కండిషన్ పెట్టినందుకే తీవ్ర మైన బాధతో తన సోదరుడు తిరిగొచ్చాడని ఆ ఒత్తిడిలోనే 24 గంటలు కాకుండానే శవమైన మిగిలాడని నాగిరెడ్డి సోదరి చెప్పిన వివరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. 
 
మనిషిని నిలువునా చంపేయడమే కాకుండా నాగిరెడ్డి మరణ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరికలూ లేవు అంటూ పదే పదే మాట్లాడుతుండటం మరక అంటకుండా తప్పించుకునే ప్రయత్నం కాదా.. నాగిరెడ్డి చితి మంటలు ఇంకా ఆరక ముందే ఆయన కుమార్తెను, బావమరి దిని శాసనసభకు రప్పించి వారి చేత రాజకీయాలు మాట్లాడించిన వైనం చూస్తే చనిపోయిన తర్వాత కూడా రాజకీయాలు చేయకుండా కొంత కాలం మౌనంగా ఉండలేరా అని ఆలోచనాపరులు మథనపడుతున్నారు.
 
ఏది ఏమైనా నాగిరెడ్డి మరణం ఆయన కుటుంబానికి, ముఖ్యంగా పిల్ల లకు తీరని లోటు. ఎవరూ తీర్చలేని వ్యక్తిగత దుఃఖం. తల్లిని కోల్పోయిన మూడేళ్లలోపే తండ్రిని కూడా పోగొట్టుకున్న ఆ పిల్లల దుఃఖాన్ని ఎవరూ తీర్చ జాలరు. నాగిరెడ్డి శాసనసభకు వచ్చింది కూడా అటువంటి విషాద సంద ర్భమే. తన అన్న, శాసనసభ్యుడు భూమా వీరశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఖాళీ అయిన ఆళ్లగడ్డ స్థానం నుండి 1992 ఉప ఎన్నికల్లో నాగి రెడ్డి పోటీ చేశారు.
 
ప్రత్యర్థి ముఠా బాంబు దాడిని ఎదుర్కొని, తొలి నామినేషన్‌ వేసి గెలిచి శాసనసభకు వెళ్లిన నాగిరెడ్డి పలు మార్లు శాసనసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యుని గెలిచారు. చివరికి అటువంటి మరో ప్రత్యర్థిని గెలిపించకపోతే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న మానసిక వ్యధతో కుంగిపోవాల్సి రావడం, ఆ  కార ణంగా గుండె ఆగి చనిపోవడం విచారకరం. మరణించిన వారి గురించి మంచే మాట్లాడాలి. కాబట్టి  ఈ విషయాలు ప్రస్తావించలేకే మంగళవారం నాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభకు బయటే ఉండిపోయింది. దానికి కూడా అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలు చేశారు. ఏమాత్రం అనుభవం లేని అఖిలప్రియ నోట రాజకీయం పలికించారు. 
 
మనిషి చనిపోయినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. తప్పులు ఒప్పులు అయిపోవు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ కుటుంబానికి ఇవ్వనంత గౌరవం భూమా నాగిరెడ్డి కుటుంబానికి వైకాపా కల్పించింది నిజం. ఆ కుటుంబంలో ముగ్గురికి ఎంఎల్ఏ సీటు ఇచ్చి గెలిపించింది నిజం. కానీ అరెస్టులు చేసి, కేసులు పెట్టి, జైలుకు పంపి, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే ఫిరాయింపుతో పార్టీ మార్పించి పబ్బం గడుపుకున్న వారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా శవరాజకీయం చేస్తే బతికి ఉన్న వారు సరే.. నాగిరెడ్జి ఆత్మ క్షోభించకుండా ఉండదా. పార్టీ మారితే 3 రోజుల్లో మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపిన వారు ఒకటన్నర సంవత్సరం పట్టించుకోకుండా పోవడమే కాకుండా ఇప్పుడు తాను లేని సమయంలో తన పేరిట రాజకీయాలు చేయడం నాగిరెడ్డి ఆత్మకు శాంతి కలిగించే విషయమేనా..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టలో వేలెడితే చీమే కుడుతుంది. ఫైన్ కట్టమని పీడిస్తే ఆమాత్రం కోపం రాదా మరి