Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టలో వేలెడితే చీమే కుడుతుంది. ఫైన్ కట్టమని పీడిస్తే ఆమాత్రం కోపం రాదా మరి

పెద్దనోట్ల రద్దు సృష్టిస్తున్న ఇబ్బందులు ఇన్నీ అన్నీకావు. చివరికి హాయిగా బతుకుతున్న వారు కూడా నేరస్తులు కాక తప్పని పరిస్థితులను పుట్టించేస్తున్నారు. ఇంతకాలం ఆర్థిక ఇబ్బందులను మాత్రమే కలిగిస్తున్న పెద్ద నోట్ల రద్దు ఇప్పుడు సామాజిక అశాంతిని, నేర పరిస్థ

Advertiesment
atm machine
హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (02:41 IST)
పెద్దనోట్ల రద్దు సృష్టిస్తున్న ఇబ్బందులు ఇన్నీ అన్నీకావు. చివరికి హాయిగా బతుకుతున్న వారు కూడా నేరస్తులు కాక తప్పని పరిస్థితులను పుట్టించేస్తున్నారు. ఇంతకాలం ఆర్థిక ఇబ్బందులను మాత్రమే కలిగిస్తున్న పెద్ద నోట్ల రద్దు ఇప్పుడు సామాజిక అశాంతిని, నేర పరిస్థితులను కూడా సృష్టిస్తుండటం చూసి నివ్వెరపోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఏటీఎం బాక్సును పగలగొడుతున్న యువకుడు మనిషి నేరం ఎందుకు చేస్తాడో, ఏ పరిస్తితులు అతడిని నేరం చేసేలా పురికొల్పుతాయో యావత్ సమాజానికి గుణపాఠం చెబుతున్నాడు.
 
ఏటీఎంలలోంచి డబ్బులు రాకపోవడంతో ప్రజల్లో అసహనం, అసంతృప్తి తీవ్రమవుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా ఎక్కడా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా అవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎక్కడ తిరిగినా డబ్బు దొరక్కపోవడంతో అసహనానికి గురైన ఓ యువకుడు ఏకంగా ఏటీఎంలపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కాడు. 
 
కోఠి ఉమెన్స్ కాలేజీ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వచ్చిన ఓ యువకుడు ఆ ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో దాని అద్దాలను పగులగొట్టాడు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి.. ఏటీఎంను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నఅమీర్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు ప్రశ్నించినప్పుడు అమీర్ ఖాన్ చెప్పిన విషయం మరో కొత్త వివాదానికి కారణమైంది. ట్రాఫిక్ పోలీసులు వేధించడం వల్లే తాను ఏటీఎంను ధ్వంసం చేశానని అతడు చెప్పాడు. 
 
పెండింగులో ఉన్న చలాన్ మొత్తం అప్పటికప్పుడే చెల్లించాలంటూ తన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారని, తన చేతిలో డబ్బులు లేకపోవడంతో పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఎన్నిచోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించానన్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా అంటే గౌరవం ఉంది కాబట్టే 3 అసెంబ్లీ స్థానాలిచ్చాం.. బాబు నిలువునా చంపేశారు