Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖ్యమంత్రి తన తలను నరుక్కుంటాడా?: వంగలపూడి అనిత

ముఖ్యమంత్రి తన తలను నరుక్కుంటాడా?: వంగలపూడి అనిత
, శుక్రవారం, 16 జులై 2021 (09:37 IST)
జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడిగిన ఒక్కఛాన్స్ , రాష్ట్రాన్ని దోచుకోవడానికని ప్రజలకు అర్థంకావడానికి రెండేళ్లు పట్టిం దని, ఇప్పుడు ముఖ్యమంత్రి కన్ను పంచభూతాలను ఆరా ధించే గిరిజనులపై, వారినివాసప్రాంతంపై పడిందని తెలుగు మహిళరాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టంచేశారు. ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే ..!

జగన్మోహన్ రెడ్డి తన అధికారమనే రాక్షసపంజాని ప్రస్తుతం గిరిజనుల మన్యంపై విసిరాడు. మన్యంనేలలోని విలువైన ఖనిజసంపదను తనపరంచేసుకుంటున్నాడు. తూర్పుగోదా వరి జిల్లాలోని రౌతులపూడి నుంచి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం, సిరిపురం వరకు భారీరోడ్డునిర్మాణంచేశారు. దానిద్వారా భమిడిక అనే పంచాయతీ పరిధిలోని ఖనిజం తవ్వకాలకు అనుమతులు పొందారు.

అక్కడ జరుగుతున్న ఖనిజంతవ్వకాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి కుమారు డిప్రమేయముంది. జగన్మోహన్ రెడ్డి, ఆయన బంధువర్గం జేబులు నింపుకోవడానికి ఆదీవాసుల జీవనవిధానాన్ని భ్రష్టుపట్టించి, వారితాలూకా సంపదను దోచేస్తున్నారు. ఒక్క మాటలేచెప్పాలంటే అటవీపరిరక్షణ చట్టాలనుకూడా తుంగ లో తొక్కిమరీ జగన్ అండ్ కో ఖనిజతవ్వకాలు సాగిస్తోంది.

ఇంతజరుగుతున్నా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అటవీశాఖలు ఏంచేస్తున్నాయి.  ఆయావిభాగాల్లోని అధికారులువారు చేయాల్సిన పనిమర్చిపోయి, వైసీపీకి తొత్తులుగా మారారా అని ప్రశ్నిస్తున్నాం. ఈమధ్యనే తాము ఖనిజతవ్వకాలు జరుగుతున్న ప్రాంతపరిశీలనకువెళ్లాము. అక్కడవేసిన రోడ్డు, జరుగుతున్న మైనింగ్ వ్యవహారం చూశాక ఒక్కరోజు లో ఇవన్నీఎలా సాధ్యమయ్యాయని వాపోయాము.

ఆదీవాసులు నివాసప్రాంతాలమధ్యనుంచి, కొండలు, గుట్ట లు తవ్విమరీ ఖనిజాన్ని తరలించడానికి రోడ్డువేశారు. గ్రీన్ ట్రైబ్యునల్, అటవీశాఖచట్టాల నిబంధనలప్రకారం అటవీప్రాం తంలో ఏదైనా రోడ్డువేయాలంటే ఎన్నోఅనుమతులు, మరెన న్నో వ్యయప్రయాసలుంటాయి. అటవీశాఖ నిబంధనలప్రకా రం కేవలం 8మీటర్ల వెడల్పుకి మించి రోడ్డువేయడానికి వీల్లే దు. కానీ తాము అక్కడచూసినరోడ్డు సుమారుగా40మీటర్ల వెడల్పుతోఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే మినీహైవేనే అడవిలో నిర్మించారు. రోడ్డునిర్మాణానికి స్థానిక డీఎఫ్ వో  అనుమతివ్వకపోవడంతో, కలెక్టర్ కేవలం ఒకేఒక గంటలో అనుమతిచ్చారు.  ఆవిధంగా పొందిన అనుమతితో  ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో రోడ్డువేశారు. ఉపాధికల్పించే పథకం కింద, కేవలం మనుషులతోమాత్రమే వేయాల్సిన రోడ్డుని భారీయంత్రాలసాయంతో వేసేశారు.

ఎప్పుడో బ్రిటీష్ పాలన లో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకుందని చదువుకు న్నాము. కానీ ఇప్పడు కళ్లముందే కడపకంపెనీల  దోపిడీ ఎలా ఉంటుందో చూస్తున్నాము. కడపకంపెనీలు, వాటితా లూకా దళారులు, జగన్మోహన్ రెడ్డి బంధువులకు చట్టాలు, నిబంధనలు ఏవీవర్తించవు. వారంతా అనుసరించేది రాజారె డ్డి రాజ్యాంగాన్నే. దానిప్రకారంగానే పచ్చని మన్యంలో యథే చ్ఛగా ఖనిజసంపదను దోపిడీచేస్తున్నారు. 

అటవీప్రాంతంలో రోడ్లువేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతివ్వరు. అలాంటిది కేవలం గంటలవ్యవధిలోఅటవీ భూమిలో ఎలా రోడ్డువేశారు. ఎవరి అనుమతితో వేశారు? నచ్చినట్లు అనుమతులు తీసుకొని, ఐఏఎస్ అధికారులతో నే అంతా చేయించేస్తారా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా జగన్ కిందపనిచేస్తున్నామని భావిస్తున్నారుతప్ప, రాజ్యాంగంప్రకారం పనిచేయాలని భావించడంలేదు.

అసలు ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని మర్చి పోయినట్లున్నారు. అటవీశాఖ అనుమతులతో పాటు, పర్యావరణవిభాగమైన సీఎఫ్ వో  అనుమతులుకూడా కావా లి. సీఎఫ్ వో అనుమతి పొందాకే, మైనింగ్ అనుమతులుపొం దాలి. అదేమీ జరగలేదు.

ఎస్సీ,ఎస్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఆయనఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీలను దాడులతోభయపెట్టేసి, ఇళ్లల్లోంచి బయటకురాకుండాచేశారు. అమాయకులైన గిరిజనులు, ఆదీవాసులేలక్ష్యంగా ఇప్పుడు వేధింపులు, దాడులు, దారుణాలు ప్రారంభమయ్యాయి. అడవిపుత్రుల పరిరక్షణచట్టాలు ఏమయ్యాయి? పర్యావరణపరిరక్షణ ఏమైంది.

గిరిజనప్రాంతంలో వేసినభారీరోడ్డుకోసం ఎన్నోఏళ్ల నుంచి ఉన్న భారీవృక్షాలను నేలకూల్చారు. అక్కడున్న వన్యప్రాణులను సైతం ఎటుతరిమేశారో, చంపేశారో తెలియ డంలేదు. గతంలో ఇదే మైనింగ్ విషయంపై ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలోభారీసభ నిర్వహించా డు. ఆరోజు ఆదీవాసులంతా తనవారేనని, వారికి అన్యాయం చేస్తే చంద్రబాబునాయడి తలనరుకుతానని ప్రగల్భాలుపలి కాడు.

ఇప్పుడేమో ఆదీవాసుల తలలు నరికేలా విలువైన ఖనిజసంపదను లూఠీచేస్తున్నాడు. విశాఖమన్యంలో జరు తున్న అక్రమమైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు లేఖ రాశాము. అటవీభూములు, పోడుభూములు, కొన్ని ప్రత్యే క ప్రాంతాల్లోఇష్టానుసారం మైనింగ్ చేయడానికి వీల్లేదు. కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఇప్పుడు ఆనిబంధ న అమలుచేయడంలేదు. కడపగ్యాంగ్ సాయంతో దోపిడీయే లక్ష్యంగా యథేచ్ఛగా మైనింగ్ సాగుతోంది.

అక్కడ తిరుగు తున్నవన్నీ భారతి సిమెంట్స్ లారీలే. సాధారణంగా ఎక్కడై నా రోడ్డువేయమంటే ఈప్రభుత్వం మాదగ్గర డబ్బుల్లేవంటుం ది. అనేకప్రధాన రహదారులన్నీ గోతులమయమై ఎక్కడి డక్కడ నరకకూపాలుగా మారాయి. అయినా కనీసం గుంత లుపూడ్చినపాపానకూడా ఈప్రభుత్వం పోలేదు. అలాంటి ప్రభుత్వం, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మైనింగ్ కోసమే అటవీప్రాంతంలో భారీరోడ్డువేసింది.

అదికూడా ఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో. రూ.15వేలకోట్లదోపిడీకోసం ఆదీవా సుల జీవనవిధానాన్ని సర్వనాశనంచేయడానికి జగన్ ప్రభ త్వంపూనుకుంది. జగన్మోహన్ రెడ్డి ఖనిజదోపిడీదెబ్బకు ఉత్తరాంధ్ర బచావ్ అనేఉద్యమం చేపట్టాల్సివచ్చేలా ఉంది. మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించడానికివెళ్లిన తాము, అక్కడ జరుగుతున్నవ్యవహారమంతా చూశాక, దాన్ని ప్రపంచానికి తెలియచేయాలని భావించాము.

రౌతులపూడిలో ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్థమవుతుంటే, వైసీపీరక్షకభటులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. రాష్ట్రంలోని పోలీసులు ఐపీఎస్ సెక్షన్లకు బదులు వైసీపీసెక్షన్లే అమలుచేస్తున్నారు. ఎందు కు ప్రెస్ మీట్ పెట్టనివ్వరని అడిగినపాపానికి మాపై దాడిచేసి నంత పనిచేశారు.అకారణంగా మమ్మల్ని దూషిస్తూ, అరెస్ట్ పేరుతో వ్యాన్ ఎక్కించారు. దారిలో దింపేసి, తిరిగి పోలీస్ స్టేషన్ కు తరిలించారు.

పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాక అక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెబుతూ, నోటీసులిచ్చారు. పోలీస్ శాఖ వైసీపీప్రభుత్వానికి ఊడిగంచేస్తోంది తప్ప, ఎక్క డా చట్టప్రకారం విధినిర్వహణ చేస్తున్నట్లు లేదు. జగన్మోహ న్ రెడ్డి దళారులకు, బినామీలకు ఊడిగంచేస్తున్నారేమో అనిపిస్తోంది. ఆనాడు మమ్మల్ని అరెస్ట్ చేసినవారు , తిరిగి స్టేషన్ బెయిల్ పై ఎందుకు విడుదలచేశారో సమాధానం చెప్పాలి.

ఇవన్నీ చూశాకే తాము, అక్రమ మైనింగ్ వ్యవహా రం సంగతేమిటోతేల్చాలని నిర్ణయించుకున్నాం. అందుకే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు లేఖరాస్తున్నాం. సుప్రీంకోర్టు నిబంధనలకువిరుద్ధంగా ఇష్టానుసారం ఏపీప్రభుత్వం సాగి స్తున్న మైనింగ్ పై దృష్టిపెట్టాలని ట్రైబ్యునల్ ను కోరాము. రాజ్యాంగంప్రకారం గిరిజనులు, ఆదీవాసులు  పరిరక్షణకోసం ఉన్నచట్టాలను దారుణంగా అతిక్రమించారు.

గిరిజనులు, గిరిజనుల సంపదను కాపాడేవరకు టీడీపీఊరుకోదని కూడా జగన్మోహన్ రెడ్డికి స్పష్టంచేస్తున్నాము. గిరిజనులకు న్యాయం చేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ వారిని కోరుతున్నాం. ఆదీవాసులమనుగడనే ప్రశ్నార్థకంచేసిన మైనింగ్ ను తక్షణ మే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. మైనింగ్ ప్రాంతం లోఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పడం, నిజంగా ప్రజలను మోసగించడమే.

స్థానిక పంచాయతీల తీర్మానం లేకుండా, ఎలాంటి అనుమతులులేకుండా రోడ్డు ఎలావేశా రు? 5ఏళ్లక్రితం ఎవరో పొందిన తీర్మానాలను ఆధారంచేసుకొ ని ఇష్టానుసారంమైనింగ్ చేయడానికి వీల్లేదు. 5ఏళ్లు అయ్యాక కొత్తగా తిరిగి పంచాయతీతీర్మానం పొందాలి. అదేమీ లేకుండానే పాత తీర్మానంఆధారంగానే నిబంధన లకు విరుద్ధంగానే మైనింగ్ సాగుతోంది.

తమకు రక్షణ కల్పించడానికి అరెస్ట్ చేశామని ఆనాడు పోలీసులు చెప్పారు. నిజంగా రక్షణకల్పించేవారే అయితే ఇంధనం లేని వాహనంలోకి మమ్మల్ని ఎక్కిస్తారా? పోలీసుల వైఖరి చూస్తుంటే నిజంగా చాలాబాధేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సానియా మీర్జా దంపతులకు యూఏఈ 'గోల్డెన్ వీసా'