Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంగన్వాడీ ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ పునఃప్రారంభం : సీడీపీవో సముద్రవేణి

అంగన్వాడీ ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ పునఃప్రారంభం : సీడీపీవో సముద్రవేణి
, ఆదివారం, 31 జనవరి 2021 (09:55 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఫిబ్రవరి 1 వ తేదీ నుండి అంగన్ వాడీ కేంద్రాలను పునః ప్రారంభించడం జరుగుతుందని సీడీపీవో సముద్రవేణి శనివారం ఒక  ప్రకటనలో తెలిపారు.
 
 అంగన్వాడీ ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ కు వచ్చే 3 సం.రం. నుండి 5 సం.రం. చిన్నారులకు పోషకాహారం(మిడ్ డే మీల్స్) అందించడం జరుగుతుందన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలను మాస్కులతో పంపించాలన్నారు. 
 
చిన్నారులకు ఫ్రీ ప్రైమరీ స్కూలు ఉదయం 9 గంటలు నుండి మద్యాహ్నం 1 గంట వరకు నిర్వహించి పోషక విలువలతో కూడిన మిడ్ డే మీల్ చిన్నారులకు అంగన్ వాడీ కేంద్రంలోనే అందిస్తామన్నారు. 3 సంవత్సరంలోపు పిల్లలకి మరియు గర్భిణీ, బాలింతలకి ఇప్పుడు ఇస్తున్న విదానంలోనే పౌష్టికాహారాన్ని అందిస్తామన్నారు.

అంగన్ వాడీ కేంద్రాలు ప్రారంబించడానికి ముందుగానే సంబందిత అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మాస్కులు ధరించి కేంద్రాలను శుభ్రపర్చాలన్నారు. చిన్నారులకు అందించే పోషహారం తయారీ విషయంలో నాణ్యతను పాటించాలన్నారు. 
 
ఆహార నిల్వలు పరిశీలన తరువాత మాత్రమే వినియోగించాలన్నారు. పోషకారహారం నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించిన సంబందిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్దులను, అనారోగ్య సమస్యలు ఉన్న వారిని కేంద్రంలోనికి అనుమతించకూడదని చెప్పారు. కొత్తగా తయారు చేసిన మెటీరియల్ ప్రకారం చిన్నారులకు ఫ్రీ స్కూలు సిలబస్ భోదించడం జరగుతుంది. గృహ సందర్శనలో గర్బణీ బాలితలకు కౌన్సిలింగ్ ఇవ్వజరగుతుంది. 
 
పిల్లల బరువులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆంగన్‌వాడీ ఫ్రీ ఫ్రైమరీ స్కూలు నిర్వహించడంతో పాటు, పోషక విలువలు తక్కువుగా ఉన్న చిన్నారుల పట్ల మరింత శ్రద్ద తీసుకోవడం జరుగుతుంది. కోవిడ్ లక్షణాలు ఉన్న తల్లులను గాని, పిల్లలనుగాని గుర్తించినట్లయితే వెంటనే వైద్యసిబ్బందికి తెలియజేసి అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రపర్చడం జరుగుతుందని సీడీపీవో సముద్రవేణి ఆ ప్రకటనలో తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచివాలయం సిబ్బంది భాద్యతాయుతంగా విధులు నిర్వ‌హించాలి