Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం... నేడు కూడా మరికొన్ని రైళ్లు రద్దు

train
, మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:26 IST)
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అక్టోబరు 31వ తేదీ మంగళవారం కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. వీటిలో ప్రధాన రైళ్లుగా భావించే హౌరా - సికింద్రాబాద్‌(12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హౌరా - బెంగళూరు(12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - హైదరాబాద్‌(18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 
 
అలాగే, తిరుపతి - పూరీ(17480) ఎక్స్‌ప్రెస్‌, పలాస - విశాఖ (08531) ప్యాసింజర్‌, తిరుపతి - విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ - గుణుపూర్‌(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూరు(18463) మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని కోరారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొలంలోకి గొర్రెలు వచ్చాయని... వైకాపా నాయకుడి దౌర్జన్యం... యువతులపై దాడి...