సింహాచలం ఆలయంలో చందనోత్సవ వేడుకల సందర్భంగా గోడకూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ సారథ్యంలో త్రిసభ్య కమిటీని నియమించగా, ఆ కమిటీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాత్కాలిక గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించేందకు ఇంజనీరింగ్ అధికారి ఎవరూ లేకపోవడంతో ఆమోదం కూడా లేకపోవడంతో పునాదులు లేకుండానే కాంట్రాక్టర్ గోడ నిర్మించాడు. పైగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రధానగా మొదటి నుంచి ఇప్పటివరకూ చేసిన ఓ ఒక్క పనికీ సరైన అనుమతులు లేవని విచారణలో వెల్లడైంది.
తాత్కాలిక గోడ నిర్మాణం ఎందుకు చేపట్టారు. ఎవరు అనుమతిచ్చారు. ఎవరు పర్యవేక్షించారు అనే విషయాలకు స్పష్టమైన సమాధానం అధికారులు విచారణ కమిటీ ముందు చెప్పలేక పోయారు. అంతేకాకుండా మూడు అంతస్తులు నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలోనూ ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు ప్రారంభించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ గోడకూలిన ఘటనలో పర్యాటక శాఖ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, కాంట్రాక్టర్ ఈ దుర్ఘటనకు బాధ్యులేనని ప్రాథమిక విచారణలో తేలింది. కింది నుంచి పైకి వరకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహించినట్టు విచారణ కమిటీ నిర్ధారించింది. తప్పను ఒకరిపై మరొకరు తోసుకుంటా బాధ్యతల లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నట్టు కమిటీ గుర్తించింది.