Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్‌ను వెనక్కి నెట్టిన ఏపీ.. జేయూల్లో 42శాతం అమలు.. పరిశ్రమల్లో ఏపీనే టాప్..

ప్రత్యేక హోదాతో ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుందని.. కేంద్రంతో రాజీ పడిందని.. ఉద్యమ బాట పట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు విపక్షాలు సైతం ఆర్కే బీచ్‌లో శాంతియుతంగా నిర్వహించేందుకు ఒక్కటయ్యాయి

గుజరాత్‌ను వెనక్కి నెట్టిన ఏపీ.. జేయూల్లో 42శాతం అమలు.. పరిశ్రమల్లో ఏపీనే టాప్..
, శుక్రవారం, 27 జనవరి 2017 (16:11 IST)
ప్రత్యేక హోదాతో ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుందని.. కేంద్రంతో రాజీ పడిందని.. ఉద్యమ బాట పట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు విపక్షాలు సైతం ఆర్కే బీచ్‌లో శాంతియుతంగా నిర్వహించేందుకు ఒక్కటయ్యాయి. అయితే ఈ ఉద్యమాన్ని ఏపీ సర్కారు అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ మరో రికార్డును సాధించింది.

భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలేవీ అమలులోకి రావడం లేదని విపక్షాల విమర్శలకు ఏపీ సర్కారు గణాంకాలతో సూటిగా సమాధానమిచ్చింది. పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో 42 శాతం అమల్లోకి రావడంతో పాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ అగ్రస్థానంలో చేరింది. ఈ క్రమంలో గుజరాత్‌ను కూడా ఏపీ వెనక్కి నెట్టి రికార్డు సృష్టించింది. 
 
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా వెనక్కి పడిపోయింది. అందుకే సీఎం చంద్రబాబు పరిశ్రమలు ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుజరాత్, ఢిల్లీలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏపీలో నిర్వహించారు. ఇందుకు విశాఖలో సీఐఐ అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో 328 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా రూ.4,62,234కోట్ల పెట్టుబడులొచ్చాయని ఏపీ సర్కారు తెలిపింది. ఈ సదస్సు ద్వారా విపక్షాలకు సరైన సమాధానం ఇచ్చినట్లైందని ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు. ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ముందుకొస్తున్నాయని ఏపీ మంత్రులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్... ఆ అస్త్రం ప్రయోగించండి... కాంగ్రెస్ పరుగెడుతుంది... తెదేపాకు మైండ్ వుంటే... ఉండవల్లి వ్యాఖ్య