జగన్... ఆ అస్త్రం ప్రయోగించండి... కాంగ్రెస్ పరుగెడుతుంది... తెదేపాకు మైండ్ వుంటే... ఉండవల్లి వ్యాఖ్య
ప్రత్యేక హోదా పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదనీ, హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీతో బ్రహ్మాండమైన అభివృద్ధి అంటున్న సీఎం దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో
ప్రత్యేక హోదా పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదనీ, హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీతో బ్రహ్మాండమైన అభివృద్ధి అంటున్న సీఎం దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి కేటాయించాల్సిన నిధులకే ప్యాకేజీ అని పేరు పెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలనీ, జగన్ మోహన్ రెడ్డి ఆ అస్త్రం ప్రయోగిస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతునిస్తారని చెప్పుకొచ్చారు. వారితోపాటు లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ మద్దతిస్తాయని, మైండ్ పెట్టి ఆలోచన చేస్తే తెదేపా ఎంపీలు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన ఎంపీల చేత రాజీనామాలు చేయించేబదులు అవిశ్వాస తీర్మానం పెట్టడం మంచిదని సూచన చేశారు.