Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిలో నాలుగు స్టార్ హోటళ్లు : కొత్త టూరిజం పాలసీ

Advertiesment
amaravati

ఠాగూర్

, శుక్రవారం, 17 అక్టోబరు 2025 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అమరావతితో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో భారీ హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను చేపట్టే సంస్థలకు కొత్త టూరిజం పాలసీ 2024-29 కింద భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాజధాని అమరావతిలో రెండు నాలుగు నక్షత్రాల హోటళ్లు ఏర్పాటుకానున్నాయి. వీటిలో ఒక హోటల్‌ను 'సదరన్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్' నిర్మించనుండగా, మరొకదాన్ని 'దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్' చేపట్టనుంది. వీటితో పాటు అరకులో పర్యాటకులను ఆకట్టుకునేలా 'వీఎస్కే హోటల్స్ 17అండ్ రిసార్ట్స్ ఎల్ఎల్పీ' సంస్థ ఒక ఎకో లగ్జరీ రిసార్టును నిర్మించనుంది. ఈ మూడు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
 
ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇందులో భాగంగా పదేళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీని తిరిగి చెల్లించనుంది. ప్రాజెక్టులో పెట్టే మూలధన పెట్టుబడిలో 10 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయించడంతో పాటు, పరిశ్రమలకు ఇచ్చే ధరలకే విద్యుత్తును సరఫరా చేయనుంది. ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకాన్ని కూడా రీయింబర్స్‌మెంట్ చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి