Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం - ఏకంగా 40మందిలో లక్షణాలు

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం - ఏకంగా 40మందిలో లక్షణాలు
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:00 IST)
విశాఖపట్టణం ఏజెన్సీలో అంత్రాక్స్ అలజడి కలకలం రేపింది. పలువురు చిన్నారులతో పాటు ఏకంగా 40 మంది వరకు ఈ వ్యాధి సోకింది. దీంతో స్థానికులతో పాటు అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. 
 
దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏజెన్సీ జిల్లాలోని అనేక మందికి అంత్రాక్స్ వ్యాధి సోకింది. వీరిలో ఏకంగా 15 మంది వరకు చిన్నారులు ఉండటం గమనార్హం. గత వారం రోజులుగా బాధితులు శరీరంపై కురుపులతో బాధపడుతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నమూనాలు బాధితులతో పాటు స్థానికుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశాఖలోని కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి విశ్వేశ్వర రావు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు