Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా మాందాత నియామకం

Advertiesment
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా మాందాత నియామకం
, గురువారం, 18 మార్చి 2021 (15:25 IST)
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాందాత సీతారామమూర్తి నియమితులయ్యారు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడీషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ గోచిపాటా శ్రీనివాస రావు నాన్ జ్యుడీషియరీ సభ్యునిగా నియమితులయ్యారు.
 
న్యాయవ్యవస్థలో అపార అనుభవం.. 
జస్టిస్ మాందాత సీతారామ మూర్తి స్వస్థలం కాకినాడ. 12 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 1996లో జిల్లా జూనియర్ గ్రేడ్-2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. 
 
నెల్లూరులో జిల్లా రెండో అదనపు న్యాయస్థానం, కర్నూలులో మూడో అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
 
గోల్డ్ మెడలిస్ట్.. 
2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పదవీ విరమణ చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1996-96 మధ్యకాలంలో జిల్లా న్యాయమూర్తిగా శిక్షణ పొందే సమయంలోనూ బంగారు పతకాన్ని సాధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనుంది.. ఐరాస