Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వ్యక్తికి 9మంది భార్యలు.. 14మంది పిల్లలు.. 8 సెంట్ల కోసం కొడుకు..?

Advertiesment
Andhra Pradesh
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (19:25 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేయటానికి యత్నించాడో కొడుకు. కానీ ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఆ తండ్రికి ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా తొమ్మిదిమంది భార్యలు. అంతమంది భార్యలు ఉన్న తండ్రి ఏమన్నా పేద్ద కోటీశ్వరుడా అంటే అదీకాదు. కనీసం లక్షాధికారి కూడా కూడా కాదు. శవాలను దహనం చేయగా వచ్చిన డబ్బులతో జీవించే వ్యక్తి. కానీ భార్యలు మాత్రం ఏకంగా తొమ్మిదిమంది. 14 మంది పిల్లలు.
 
వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలో చలపతిరావు కాలనీకి చెందిన కుందాని భాస్కర్‌ అలియాస్‌ శవాల భాస్కర్ అనే 52 ఏళ్ల వ్యక్తి శవాలను దహనాలు చేసి జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలను తీసుకెళ్లి ఖననం చేస్తుంటాడు. దాంతో వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. కానీ భార్యలు మాత్రం 9మంది. 14 మంది పిల్లలు ఉన్నారు. 
 
వీరిలో ఎనిమిదవ భార్య ఉషారాణిని 12 ఏళ్ల క్రితం హత్య చేసి భాస్కర్‌ జైలుకు వెళ్లాడు. కొంతకాలానికి బయట కొచ్చాడు. ఆ తరువాత ఈ నిత్య పెళ్లికొడుకు కలకడకు చెందిన ఆదెమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆదెమ్మను పెళ్లి చేసుకుని మకాం మొత్తం కలకడకు మార్చేశాడు. ఏదో పనిచేసుకుని బతుకుతున్నాడు. అంతకు మందు పెళ్లి చేసుకున్న భార్యల్ని గానీ..వాళ్లకు పుట్టిన పిల్లల్ని గానీ పట్టించుకోవటం మానేశాడు.
 
ఈ క్రమంలో భాస్కర్ రెండవ భార్య ప్రభావతి 23 ఏళ్ల కొడుకు దినేష్‌ చలపతిరావు కాలనీలో తండ్రి పేరుమీద ఉన్న 8 సెంట్లు భూమిలో తనకూ భాగం ఇవ్వాలని తండ్రిని అడిగాడు. అందుకు తండ్రి దాటవేశాడు. అలా మదనపల్లికి వచ్చిన తండ్రిని దినేష్‌ తన అనుచరులను తీసుకెళ్లి వెళ్లి ఆస్తి పంపకం గురించి మరోసారి అడిగాడు. దీంతో భాస్కర్ నా ఆస్తి ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో దినేష్‌కు కోపం కట్టలు త్రెంచుకుంది. కోపంతో ఊగిపోయాడు. అంతే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో తండ్రిపై దాడిచేసి, గొంతు కోశాడు.
 
ఆ తరువాత తండ్రి చనిపోయాడని అనుకుని అక్కడనుంచి పరారయ్యాడు. కొంతసేపటికి తేరుకున్న భాస్కర్‌ గాయంతోనే రామ్‌నగర్‌లో ఉన్న మరో కొడుకు వద్దకు వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో ఏం జరిగిందో తెలియకపోయినా హుటాహుటిన తండ్రిని జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐలు ఆస్పత్రికి చేరుకుని ప్రాధమిక విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరొక వ్యక్తితో చాటింగ్.. భర్త పిల్లల్ని మరిచిన భార్య.. చివరికి..?