Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు.. జీవో నంబర్ 1 కొట్టివేత

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 12 మే 2023 (11:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రహదారులు, కూడళ్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు ఒకటిని హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులను భంగం కలిగించేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. 
 
విపక్ష పార్టీలను కట్టడి చేసేందుకు, ఆ పార్టీలు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం జీవో నంబర్ ఒకటిని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ర్యాలీలు, సభలకు స్థానిక పోలీసుల అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందేనని, వీటి పూర్తి వివరాలను పోలీసులకు ఇవ్వాలని జీవో పేర్కొంటుంది. 
 
ఈ క్రమంలో ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు హైకోర్టులో వేర్వేరురుగా పిటిషన్లు దాఖలు చేశారు. పోలీస్ యాక్ట్ 30కి భిన్నంగా ఈ జోవో ఉందని పిటిషనర్ల తరపు న్యావాది కోర్టుకు వివరించారు. రోడ్‌ల కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జోవోను ప్రభుత్వం తీసుకొచ్చిందని కోర్టుకు తెలిపారు. 
 
ఈ పిటిషన్లను జనవరి 24వ తేదీన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశఅరా, జస్టిస్ డీవీఎస్సఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేయగా, ఈ తీర్పును శుక్రవారం వెలువరించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా జీవో నంబరు 1 ఉందని వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ అరెస్టుతో పాకిస్థాన్‌‍లో అస్థిరత.. భారీగా పడిపోయిన కరెన్సీ విలువ