ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది. దీంతో ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తూ వచ్చిన బట్టు దేవానంద్, డి.రమేష్‌లు బదిలీ అయ్యారు. వీరిలో బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టు బదిలీ కాదా, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
అయితే, న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు.
దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను కొలీజియం బదిలీ చేస్తూ గురువారం సిఫార్సు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో ఇద్దరేసి, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు.
జస్టిస్ దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సిఫార్సు చేసింది.