ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికిగాను సాధారణ సెలవుల జాబితాను వెల్లడించింది. కొత్త సంవత్సరంలో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సెలవులతో పాటు మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది. సాధారణ సెలవుల్లో సంక్రాంతి మొదలుకుని క్రిస్మస్ వరకు పండగల తేదీలను ప్రకటించింది. ఏయే తేదీల్లో సెలవులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	సెలవులు - తేదీలు ఇవే..
	 
	1. మకర సంక్రాంతి - జనవరి 15 
	2. కనుమ - జనవరి 16
	3. రిపబ్లిక్ డే - జనవరి 26
 
									
										
								
																	
	4. మహాశివరాత్రి- మార్చి 8 
	5. హోలి - మార్చి 25
	6. గుడ్ ఫ్రైడే - మార్చి 29
	7. బాబూ జగ్జీవన్ రావు జయంతి - ఏప్రిల్ 5
 
									
											
									
			        							
								
																	
	8. ఉగాది - ఏప్రిల్ 9
	9. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) - ఏప్రిల్ 11
	10. శ్రీరామ నవమి - ఏప్రిల్ - 17
	11. బక్రీద్ - జూన్ 17
 
									
			                     
							
							
			        							
								
																	
	12. మొహర్రం - జులై 17
	13. స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
	14. శ్రీ కృష్ణాష్టమి - ఆగస్టు 26 
 
									
			                     
							
							
			        							
								
																	
	15. వినాయక చవితి - సెప్టెంబర్ 7 
	16. మిలాద్ ఉన్ నబీ - సెప్టెంబర్ 16 
	17. మహాత్మ గాంధీ జయంతి - అక్టోబర్ 2 
 
									
			                     
							
							
			        							
								
																	
	18. దుర్గాష్టమి - అక్టోబర్ 11 
	19. దీపావళి - అక్టోబర్ 31 
	20. క్రిస్మస్ - డిసెంబర్ 25