Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో ఉమ్మి వేయడంపై నిషేధం.. ఉల్లంఘిస్తే అయిపోతారు...

ఏపీలో ఉమ్మి వేయడంపై నిషేధం.. ఉల్లంఘిస్తే అయిపోతారు...
, ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (14:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది. ఉమ్మివేయడం, పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధించింది. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు.
 
ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో కరోనా వైరస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు. కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
రాష్ట్రంలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి తమ్ముళ్లుకాకపోతే కుక్కలు కూడా మొరగవు : విజయసాయి రెడ్డి