Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్యాసిగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే... స్వామి శివరామానందగా పేరు మార్పు

సన్యాసిగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే... స్వామి శివరామానందగా పేరు మార్పు
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:58 IST)
ఆంధ్రప్రదేష్ట్రంలోని కర్నూలు జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇపుడు సన్యాసం స్వీకరించడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. దాంతో ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు.
 
బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. దివంగత‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడిగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగారు. తొలిసారి 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓడినా, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున‌ పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2001 ఎన్నికల్లో ఆయ‌న ఓటమి చ‌విచూశారు. ఇలా ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆయ‌న‌ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్ప‌టికీ 2015 నుంచే ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపి మానస సరోవర్, చార్‌ధామ్‌, అమర్‌నాథ్‌తోపాటు ప‌లు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాటింగ్ సందేశాలు చూపిస్తానంటూ మహిళ బ్లాక్ మెయిల్, యువకుడు ఆత్మహత్య