Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయలు అరెస్టు - నేడు కోర్టులో హాజరు

Advertiesment
Anjaneyulu

ఠాగూర్

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (08:51 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటి జైత్వానీ కాందబరిని వేధించిన కేసులో పీఎస్ఆర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా, విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను లోతుగా ప్రశ్నించారు. 
 
ఉదయం ప్రారంభమైన విచారణ సుమారు ఏడు గంటల పాట కొనసాగినట్టు సమాచారం. విచారణ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక పత్రాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి ఆంజనేయులు సీఐడీ కార్యాలయంలోనే ఉంచి, బుధవారం ఉదయం కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుండగా, పీఎస్ఆర్‌ ఆంజనేయులుపై మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను తుపాకీతతో బెదిరించారన్న ఆరోపణలపై గుంటూరులోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా కేసు నమోదు చేసినట్టు తెలిసింద్. ఈ రెండు కేసులకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి