Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ : సమగ్ర స్వరూపం ఇదే.. వ్యసాయానికి పెద్దపీట...

buggana rajendranath reddy

ఠాగూర్

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే నాలుగు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాణక్యుడి తరహాలో పాలన చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
 
అంబేద్కర్ ఆశయాలో తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్ని విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు తెలిపారు. బట్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేశారు.
 
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమగ్రస్వరూపం... 
వార్షిక బడ్జెట్ రూ.2,86,389.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లు
మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు
రెవెన్యూ లోటు రూ.24,758.22 కోట్లు
ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
రెవెన్యూ లోటు 1.56 శాతం 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కాదు వైసిపి ప్రభుత్వం పడిపోతుంది: కె.ఎ పాల్