Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధ్యక్షా... మంగళగిరిని మందలగిరి అనే చెప్పే పప్పును కాదు : మంత్రి అనిల్ ఫైర్

Advertiesment
అధ్యక్షా... మంగళగిరిని మందలగిరి అనే చెప్పే పప్పును కాదు : మంత్రి అనిల్ ఫైర్
, సోమవారం, 17 జూన్ 2019 (12:35 IST)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీ జనవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏకిపారేశారు. గత టీడీపీ పాలకులు అవినీతిలో కూరుకుని పోయారంటూ మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేకపోయినా అదృష్టం కొద్దీ మంత్రి అయిన అనిల్ చంద్రబాబుకే ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరింతగా రెచ్చిపోయారు. తనకు అనుభవం లేకపోయినా మంగళగిరిని మందలగిరి అని పలికే పప్పును మాత్రం కాదు అధ్యక్షా అంటూ ఘాటుగానే స్పందించారు. 
 
రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా, సోమవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 
 
"అధ్యక్షా... నేను చంద్రబాబు కొడుకు లెక్కన నియోజకవర్గాన్ని పేరు పెట్టి కూడా పిలవలేక, మంగళగిరిని మందలగిరి అని చెప్పే పప్పును మాత్రం కాదు అధ్యక్షా. నేను డాక్టర్‌ను. ఈ ఫీల్డ్‌కు నేను కొత్త అయ్యుండొచ్చు. కానీ తొందరగానే నేర్చుకుంటాం. చంద్రబాబు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయ్యుండొచ్చు.
 
మేం కాదనడం లేదు. కానీ ఆయన అడ్డగోలుగా దోచుకుని తింటూ ఉంటే, తప్పులు చేస్తుంటే యువనేతలు మాట్లాడకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు అన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు అధ్యక్షా. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేక ఎమ్మెల్సీగా జాబ్ తీసుకున్న పప్పును మాత్రం నేను కాదు అధ్యక్షా" అంటూ కౌంటర్ల వర్షం కురిపించారు. దీంతో సభలోని వైకాపా సభ్యులు బల్లలు చరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎలాంటి తప్పులు చేశావో?: శ్రీరెడ్డి