ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తిచేశారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు.
నిజానికి ఈ ఫలితాలు శనివారమే విడుదల కావాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల కారణంగా వాయిదాపడ్డాయి. ముఖ్యంగా, విద్యాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖ అధికారులకు మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
వీటిని సరిదిద్దుకునే చర్యల్లో భాగంగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను వెల్లడించనున్నట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను
www.results.bse.ap.gov.in అనే వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చు.