Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిషింగ్‌ హార్భర్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. సీఎం జగన్ ప్రకటన

Advertiesment
Andhra govt
, మంగళవారం, 1 జూన్ 2021 (22:34 IST)
విశాఖ పట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్‌ల అభివృధ్దికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్ , ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృధ్ది సహకార సమాఖ్య, మత్స్యశాఖ, ఫుడ్ ప్రోసెసింగ్ సొసైటీ, పశుసంవర్ధక విభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృధ్ది ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ … ''ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 
 
దీనితో పాటు కాకినాడ ఫిషింగ్‌ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని, విశాఖపట్నం ఫిషింగ్‌ హార్భర్‌ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్‌ పాల సేకరణ మొదలవుతుందని చెప్పారు. ఇందువల్ల రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం చేకూరుతుందని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ 11 జూన్, 2021 నుండి UEFA యూరో 2020, కోపా అమెరికా 2021 ప్రత్యక్ష ప్రసారం