Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మా... మా నాన్న ఎవరు?' అని ప్రశ్నించిన కన్నబిడ్డకు వాతలు పెట్టిన తల్లి

Advertiesment
Anantapuram
అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడిన ఓ కసాయి తల్లి దారుణానికి ఒడిగట్టింది. అమ్మా మా నాన్న ఎవరు? అని ప్రశ్నించింది. దీనికి ఆగ్రహానికి గురైన ఆ మహిళ... కన్నబిడ్డ అని కూడా చూడకుండా కర్రుతో వాతలుపెట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కదిరి పట్టణంలోని ఓ కాలనీలో ఈ ఘటనచోటుచేసుకుంది. గత కొంతకాలం క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. అనంతరం మరొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అప్పట్నుంచి ప్రియుడిపై మోజుతో తన చిన్నారిని ఇబ్బంది పెడుతూ వస్తోంది.
 
'అమ్మా.. మా నాన్న ఎవరు..?' అని చిన్నారి ప్రశ్నించినందుకు తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో 'ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్' అంటూ చిన్నారి ఒంటి నిండా ఆ కసాయి తల్లి వాతలు పెట్టింది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాస్మా దాతలతో రక్షాబంధన్ జరుపుకున్న గవర్నర్ డా. తమిళిసై