Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దారిలోనే ప్రాణాలు విడిచిన భార్య.. తల్లడిల్లిపోయిన భర్త.. ఎక్కడ?

Advertiesment
wfi death
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (09:33 IST)
అనారోగ్యం బారిన పడిన తన భార్యకు మెరుగైన వైద్యం చేయించేందుకు భర్త ఆస్పత్రికి బయలుదేరాడు. కానీ, కట్టుకున్న భార్య కళ్లముందే... మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. భార్య చనిపోతుండటాన్ని చూసిన భర్త చేసిన రోదనలు మిన్నంటాయి. అక్కడి ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఏపీలోని అమడగూరు మండలంలోని మామిడిమేకలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప తన భార్య చౌడమ్మ (35) అనారోగ్యంతో బాధపడుతుండటతో ఆమెను వైద్య పరీక్షల కోసమని అనంతపురానికి తీసుకెళ్లేందుకు స్వగ్రామం నుంచి ఆటోలో ఓబుళదేవరచెరువుకు చేరుకున్నారు. 
 
ఓబుళదేవర చెరువు బస్టాండ్‌కు రాగానే ఆమె పరిస్థితి విషమంగా మారింది. బస్సు కోసం వేచి చూసేలోగా ఆమె మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని హత్తుకుని అతను బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కనీసం మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ప్రజలే చందాలు వసూలు చేసి శవాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామనికి చేర్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ దృశ్యం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?