Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పేరుతో వాడేసుకున్నాడు.. తీరా పెళ్లిమాటెత్తగానే...

Advertiesment
ప్రేమ పేరుతో వాడేసుకున్నాడు.. తీరా పెళ్లిమాటెత్తగానే...
, ఆదివారం, 28 అక్టోబరు 2018 (12:49 IST)
ప్రేమ పేరుతో ఓ యువతి మోసపోయింది. వివాహం చేసుకుంటానని చెప్పి ఆ యువతిని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. తీరా పెళ్లి మాటెత్తగానే చెప్పాపెట్టకుండా పారిపోయాడు. దీంతో ఆ యువతి ప్రేమికుడు ఇంటి ముందు ధర్నాకు దిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం పట్టణ కేంద్రంలోని సున్నపుగేరి వీధికి చెందిన యువతి అదే వీధికి చెందిన లింగమయ్య, ఎల్లమ్మ దంపతుల కుమారుడు శివకుమార్‌తో ప్రేమలో పడింది. 
 
యువతి చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువతిని 13 ఏళ్ల వయసులోనే ధర్మవరానికి చెందిన మేనమామ కొడుకుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే బాధిత యువతికి ఇష్టం లేకపోవడంతో పెళ్లి అయిన మరుసటి రోజే ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో ఇరు కుటుంబాలు కోర్టుకెళ్లి విడాకులు తీసుకున్నారు. 
 
అనంతరం యువతి తాడిపత్రిలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసింది. ప్రియుడు శివకుమార్‌ కూడా నగరంలోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నీ పెళ్లి, విడాకుల విషయం తెలుసని, నువ్వంటే నాకిష్టమని, నిన్ను పెళ్లి చేసుకుంటానని శివకుమార్‌ నమ్మించాడు. 
 
దీంతో నాలుగేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం గుట్టుగా సాగినా... ఇరు కుటుంబీకులకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి నిరాకరించారు. దీంతో పెద్దల మాట కాదనలేక నీవంటే నాకిష్టం లేదని, నిన్ను పెళ్లి చేసుకోనంటూ బాధిత యువతితో శివకుమార్‌ చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువతి, కుటుంబ సభ్యులు యువకుడి ఇంటి ముందు శనివారం నిరసనకు దిగారు. ఈ ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంజాయి స్మగ్లింగ్ కేసులో జూనియర్ ఆర్టిస్ట్ అరెస్టు