Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మోనియం నైట్రేట్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ముప్పు లేదు: డి‌జి‌పి

Advertiesment
అమ్మోనియం నైట్రేట్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ముప్పు లేదు: డి‌జి‌పి
, శుక్రవారం, 14 ఆగస్టు 2020 (17:50 IST)
ఏపీ వ్యాప్తంగా ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం,  వినియోగంపై  మంగళగిరి లోని పోలీసు కేంద్ర కార్యాలయం నుండి సముద్ర తీర ప్రాంతాల  జిల్లాలు శ్రీకాకులం, విశాఖపట్నం, కృష్ణ జిల్లా, గుంటూరు అర్బన్, నెల్లూరు, తిరుపతి అర్బన్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన  ఎస్పీలతో ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు గౌతం సవాంగ్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ సంధర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ.. జిల్లాలలో  అమ్మోనియం నైట్రేట్‌  నిల్వలు, వినియోగం, జాతీయ, అంతర్జాతీయ రవాణా, ఓడరేవుల వద్ద నిల్వలు, విక్రయాలపైన 2012 లో రూపొందించిన నిబంధనలను జిల్లాల ఎస్పీ లకు వివరించారు. అమ్మోనియం నైట్రేట్‌  వినియోగం పై ఖచ్చితంగా నిబంధనలు అమలుచేయాలని, అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడ  వద్దని సూచించారు. 
 
అమ్మోనియం నైట్రేట్‌ పై 2012  రూపొందించిన నిబంధనలు :
లైసెన్సు లేకుండా ఎక్కడ కూడా తయారీకి అనుమతి లేదు.
అనుమతి లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించకూడదు.
లైసెన్స్ కలిగిన గిడ్డంగులలో మాత్రమే నిల్వ ఉంచాలి.
నిబంధనలకు లోబడి ఎగుమతులు/దిగుమతులు నిర్వహించాలి.
ఎంపిక చేసిన లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే సరఫరా చేయాలి.
వేరొక పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్ ను రవాణా చేయరాదు.
కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్ కు అదనంగా రవాణాకు  అనుమతి లేదు.
18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులగా నియమించకూడదు.
అనుమతులేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్ లకు ఉపయోగించరాదు.
అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి      
 
పూర్తి స్థాయిలో అన్ని  అమ్మోనియం నైట్రేట్ 2012 నియమ, నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ... ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న  అమ్మోనియం నైట్రేట్ నిలువలు  పేలుడు పదార్థాల రవాణా / వినియోగం / అమ్మకాలు / కొనుగోళ్లు / నిల్వ కేంద్రాలు  మొదలైన వాటికి  సంబంధిచి అధికారులు తనిఖీలు నిర్వహించి, పర్యవేక్షించ వలసిందిగా ఎస్పీలను ఆదేశించారు. 
 
ఈ కార్యక్రమంలో ఏడిజి  రవి శంకర్ అయ్యన్నార్, ఇంటలిజెన్స్ ఐ.జీ మనిష్ కుమార్, డీఐజీ ఎస్వి రాజశేఖర్ బాబుతో పాటు లీగల్ అడ్వైజర్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలి: గవర్నర్ బిస్వ భూషణ్