Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొగుడి వద్దకు వెళ్లేందుకు సెలవిస్తా .. కానీ 3 నెలలకోసారి వచ్చి కోరిక తీర్చి వెళ్లు...

ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖలో ఓ కామపిశాచి బాగోతం ఇపుడు వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు సెలవు ఇవ్వాలంటే తన కోరిక తీర్చాల్సిందేనంటూ ఒత్తిడి చేశాడు.

Advertiesment
మొగుడి వద్దకు వెళ్లేందుకు సెలవిస్తా .. కానీ 3 నెలలకోసారి వచ్చి కోరిక తీర్చి వెళ్లు...
, శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:50 IST)
ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖలో ఓ కామపిశాచి బాగోతం ఇపుడు వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు సెలవు ఇవ్వాలంటే తన కోరిక తీర్చాల్సిందేనంటూ ఒత్తిడి చేశాడు. లేదంటే ఉద్యోగం నుంచి పీకేస్తానంటూ హెచ్చరించాడు. ఓ మహిళా ఉద్యోగిని పట్ల ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వివరాలను పరిశీలిస్తే...
 
గోదావరి జిల్లాల్లో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ మహిళ ఏపీపీఎస్సీ ద్వారా సర్వే శాఖలో ఉద్యోగం సంపాదించింది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త అకాలమరణం చెందారు. ఆమెకు తల్లికూడా లేదు. తండ్రితో కలిసి ఉంటోంది. ఆమెపై అదే జిల్లాలో పని చేస్తున్న ఓ సర్వే ఉన్నతాధికారి కన్నేశాడు. బలవంతంగా పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
 
అదేసమయంలో అమెరికాలో స్థిరపడిన ఓ వ్యక్తిని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచే అసలు వేధింపులు మొదలయ్యాయి. అమెరికా వెళ్లివచ్చేందుకు గత యేడాది ఆమె సెలవు ఇవ్వాలని కోరింది. ఎఫ్‌ఎమ్‌బీ డిజిటలైజేషన్‌ ఉండటం వల్ల అధికారులు నిరాకరించారు. ఇటీవల ఆ జిల్లాల్లో ఈ ప్రాజెక్టు పని 98 శాతం పూర్తయింది. దీంతో తనకు నాలుగున్నరేళ్ల సెలవు ఇవ్వాలని కోరుతూ ఆమె మరోసారి లేఖ ఇచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సీనియర్ అధికారి.. మోకాలొడ్డారు. తనకు తెలియకుండా రిలీవ్ చేయొద్దంటూ ఒత్తిడి చేశాడు. పైగా, తనను కలిసేలా ఆదేశించాలని ఆదేశించాడు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆమె, తన తండ్రితో కలిసి వెళ్లి ఆ ఉన్నతాధికారిని కలిసింది. వెంట ఆమె తండ్రి ఉన్నాడన్న విచక్షణ మరచి ఆయన నిస్సిగ్గుగా వ్యవహరించారు. 
 
'నువ్వు అసలు అమెరికాలో ఉన్న వ్యక్తిని ఎందుకు పెళ్లిచేసుకున్నావు? గవర్నమెంట్‌ నీకు సెలవు ఇచ్చినా నేను ఇవ్వను. కావాలంటే మూడు నెలల సెలవు ఇస్తాను. వెళ్లి వచ్చేసెయ్‌. నేను చెప్పినట్లు వింటే మూడు నెలల చొప్పున సెలవు ఇస్తూ ఉంటాను. అక్కడికి వెళ్లి రావచ్చు. ఇక్కడ ఉన్నంతకాలం మాత్రం నాతోనే ఉండాలి. నీ బాగోగులు నేను చూసుకొంటాను. సెలవు విత్‌డ్రా చేసుకో. లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయి. లేదంటే నిన్ను టెర్మినేట్‌ చేస్తాను' అంటూ తీవ్రస్థాయిలో బెదిరించాడు. 
 
చివరకు ఆమె పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి సెలవుపై అమెరికా వెళ్లిపోయింది. అంతేకాకుండా, తనను లైంగికంగా వేధించిన అధికారిపై లిఖిపూర్వకంగా ఫిర్యాదు చేసి వెళ్లింది. అయతే, ఉన్నతాధికారుల కాళ్లుచేతులు పట్టుకున్న ఆ అధికారి ఆ ఫిర్యాదును పసలేని ఫిర్యాదుగా మార్చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి చేసుకున్నాడు.. ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. ఆ తరువాత..?