Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి రాజధాని రైతులు ఉద్యమానికి ఒక యేడాది!

Advertiesment
అమరావతి రాజధాని రైతులు ఉద్యమానికి ఒక యేడాది!
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (15:37 IST)
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమానికి ఒక యేడాది కానుంది. ఈ నెల 17వ తేదీతో ఒక సంవత్సరం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. 
 
రేపటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది. తొలి రోజైన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. 
 
ఈ నెల 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్రను చేస్తారు. చివరిరోజయిన ఈ నెల 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13, 16న కూడా నిరసనలు తెలుపుతారు. తమ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదని, అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని ఐకాస నేతలు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. స్కూటీపై పడ్డాయి.. టీచర్ సజీవదహనం