జిల్లా కేంద్రమైన అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులోభాగగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పైనే విశ్వరూప్ అనుచరులపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సత్య రుషి, సుబాష్, మురళీకృష్ణ, రఘులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిందితుడు సత్యప్రసాద్ వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ హింసాత్మక చర్యలకు కారణమైన మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలో కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో కోనసీమలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు.