బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూరల్‌లో ఉచితంగా రెండు ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వుల జారీ చేశారు.
బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నెలకొల్పేందుకు చినగదిలి ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని ఉపయోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎలాంటి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అకాడమీ ద్వారా ప్రతిభ కలిగిన పేదవారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
అకాడమీని రెండు ఫేజుల్లో నిర్మించనున్నట్టు ప్రభుత్వానికి సింధు తెలిపింది. ఒక్కో ఫేజ్‌లో 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది.