Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భార్య-ఎస్పీ వ్యవహారాన్ని బయటపెట్టా.. చంపేస్తారేమో? భర్త భయం భయం

పరాయి మహిళతో రాసలీలల వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన బెంగళూరు రూరల్‌ జిల్లా ఎస్పీ భీమాశంకర్‌ గుళేద్‌‌కు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ (ప్రస్తుతానికి పనిలేదు) చేసినట్లు సమాచారం. ఈ ఎస్పీ స్థానంలో మరో అధికారిని నియమించారు. కాగా రాసలీలలు అంతా అబద్ధమని స

నా భార్య-ఎస్పీ వ్యవహారాన్ని బయటపెట్టా.. చంపేస్తారేమో? భర్త భయం భయం
, మంగళవారం, 17 జులై 2018 (09:42 IST)
పరాయి మహిళతో రాసలీలల వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన బెంగళూరు రూరల్‌ జిల్లా ఎస్పీ భీమాశంకర్‌ గుళేద్‌‌కు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ (ప్రస్తుతానికి పనిలేదు) చేసినట్లు సమాచారం. ఈ ఎస్పీ స్థానంలో మరో అధికారిని నియమించారు. కాగా రాసలీలలు అంతా అబద్ధమని సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్య చెపుతోంది. తన భర్త తనపై కక్ష కట్టి ఇలా తనను బజారుకీడ్చాడని అంటోంది. మరోవైపు ఎస్పీ వ్యవహారంపై పోలీసు పెద్దలు నోరు మెదపడంలేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సర్కారు కిందామీదు అవుతోంది. మరోవైపు తన భార్యతో ఎస్పీకి వున్న లింకును బయట పెట్టినందుకు తనను చంపేస్తారేమోనని ఇంజినీర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనను వారి నుంచి రక్షించాలని అభ్యర్థిస్తున్నాడు.
 
ఈ కేసుకు సంబంధించి వివరాలను చూస్తే... బెంగుళూరు, దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌(40)కు ఓ యువతితో 2010లో వివాహమైంది. రెండేళ్లపాటు అమెరికాలో ఉండి.. తిరిగి ఆ జంట నగరానికి వచ్చేసింది. భర్త టెక్కీగా పని చేస్తుంటే, భార్య మాత్రం గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గతేడాది ఆమె స్టూడియోకి ఎస్పీ భీమశంకర్‌ గులేద్‌ ఓ ఫోటో షూట్ నిమిత్తం వచ్చారు. ఆమెతో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ సిటీలో సినిమాలకు షికార్లకు వెళ్లసాగారు. ఈ విషయం టెక్కీ భర్తకు తెలిసి, భార్యను మందలించాడు. 
 
భర్తకు భయపడి కొన్నాళ్లు ఐపీఎస్ ఆఫీసర్‌ను కలవడం మానేసిన ఆమె, తర్వాత మళ్లీ కలవడం మొదలెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని భర్త... తన భార్య, ఐపీఎస్ ఆఫీసర్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ వీడియో తీశాడు. అంతేకాకుండా భార్య ఫోనులో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలను.. మొత్తం సాక్ష్యాలను సేకరించి మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేసినట్టు చెప్పాడు. ఈ వ్యవహారంలో టెక్కీ భార్య వివరణ మాత్రం మరోలా ఉంది. భర్తతో తనతో గొడవ పడి, వేరుగా ఉంటున్నాడని, ఆ కారణంగానే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపిస్తోంది. 
 
ఇక భీమశంకర్‌ భార్య కూడా సంచలన ఆరోపణలు చేస్తోంది. భీమశంకర్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆమె సైతం పోలీసులను ఆశ్రయించటం కొసమెరుపు. అయితే భీమశంకర్‌ మాత్రం తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెను ప్రలోభపెట్టి కేసు పెట్టించారంటూ చెబుతున్నాడు. ఈ వరుస ట్విస్ట్‌ల మూలంగా కేసు కోసం రాష్ట్ర హోం శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. హోంమంత్రి పరమేశ్వర ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఎట్టకేలకు ఎస్పీని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ ఫోన్‌ కోసం ఫ్రెండ్‌ను హత్య చేసిన స్నేహితుడు...