Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అలా నిలిచిపోతారని చంద్రబాబు కుట్రలు: ఆళ్ల నాని

Advertiesment
Alla Nani
ఎన్నికల మేనిఫెస్టోను ఒక చిత్తు కాగితంగా భావించకుండా, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ వంటి పవిత్ర గ్రంధంగా ముఖ్యమంత్రి భావిస్తూ మేనిఫెస్టోకు ఎంతో గౌరవం ఇస్తున్నారని శ్రీ ఆళ్ల నాని చెప్పారు. పేద ప్రజలకు ఇంటి స్థలం పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎం ఆలోచన.. దానిని చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తూ అడ్డుకున్నారని ఆయన అన్నారు. నేను చేయలేని పనిని జగన్ చేస్తే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు.
 
ఆరు నెలల క్రితమే ఇళ్ల స్థలాలు  ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ చంద్రబాబునాయుడు వల్లనే ఆలస్యం  అయిందని ఆయన అన్నారు.
 అనంతరం లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను, ఇళ్లు మంజూరు పత్రాలను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. 
 
ప్రతి ప్లాట్ వద్దకి వెళ్లి పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించిన మంత్రి ఆళ్ల నాని..
 
పట్టాలు పొందిన లబ్ధిదారులు మంత్రి ఆళ్ల నానిని ఎంతో ఆప్యాయంగా మాకు ఉచితంగా ఇళ్ల పట్టా ఇవ్వడం మా సొంత ఇంటి కల సాకారం అయిందని ఆనందం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులు దీక్షపై అమిత్ షా సమావేశం, రేపు రైతు సంఘాల నాయకులతో భేటీ