Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

ఏపీ ఆర్ధిక ఒప్పందాల‌న్నీ ర‌హ‌స్యాలే! ప‌య్యావుల కామెంట్

Advertiesment
AP financial deals
, గురువారం, 22 జులై 2021 (22:44 IST)
ఎపీఎస్డిసి చేసిన 25 వేల కోట్ల అప్పులో అంతా ర‌హ‌స్య‌మే అని ప‌య్యావుల కేశ‌వ్ విమ‌ర్శించారు. దీనిపై ఆర్ధిక మంత్రి బుగ్గన చేసిన ప్రకటనను పయ్యావుల కేశవ్ త‌ప్పుప‌ట్టారు. బ్యాంకులతో రాష్ట్రం ప్రభుత్వం చేసిన గ్యారెంటీ అగ్రిమెంట్‌ను ఆయ‌న టీడీపీ కార్యాల‌యంలో విడుదల చేశారు. ఎస్క్రూ ఒప్పంద డాక్యుమెట్లను బయటపెట్టారు. కేంద్రం ఈ ఒప్పందానికి అనుమతి నిచ్చిందా? ఇది ఆర్.బి.ఐ దృష్టిలో ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
గవర్నర్ పదవికి ఉన్న హోదాను వదులుకునేల ప్రభుత్వం ఒప్పందం ఉంద‌ని ప‌య్యావుల వ్యాఖ్యానించారు. ప‌ది మద్యం డిపోల ఆదాయాన్ని పూచీ కత్తుగా పెట్టారు!? ఇంక మధ్య పాన నిషేధం ఎక్కడ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ్యారెంటీలు ఇవ్వలేదని.. ఎస్క్రో చేయలేదని మంత్రి బుగ్గన చెబుతున్నారు. కానీ గ్యారెంటీలు ఇచ్చినట్టు ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్యుమెంట్లు ఉన్నాయి.
 
మంత్రి చెప్పింది నిజమా..? బ్యాంకర్లు చెప్పింది నిజమా..? రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా నిధులను ఎస్క్రో చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలని అగ్రిమెంటులో ప్రస్తావించారు. ఎందుకంత రహస్యం..? ఏం దాయాలని అనుకుంటున్నారు..? భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తాకట్టు పెట్టింది.

ఈ తరహా ఒప్పందాలకు కేంద్రం అంగీకారం ఉందా..? సార్వభౌమాధికారం ద్వారా వచ్చే రక్షణను వదులుకుంటామని ఒప్పందంలో అంగీకరించారు. ఒప్పందం తప్పితే కేసులు పెట్టొచ్చని స్పష్టంగా అగ్రిమెంటులో పేర్కొన్నారు. గవర్నర్ మీద కేసులు పెట్టినా ఫర్వాలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? ఇక ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయద‌ని అర్ధమవుతోంది.... 25 ఏళ్లు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారంటే మద్యపాన నిషేధం లేనట్టే క‌దా అని ప‌య్యావుల ప్ర‌శ్నించారు.
 
అసెంబ్లీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకు రాలేదు కాబట్టి.. ఈ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అంగీకరించాల్సిన అవసరం లేద‌న్నారు పయ్యావుల కేశ‌వులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వ‌ర్షాలు... క‌లెక్ట‌ర్లూ పారాహుషార్!!