Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ ఉద్యోగాలకు వయస్సు సడలింపు

Advertiesment
ప్రభుత్వ ఉద్యోగాలకు వయస్సు సడలింపు
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:32 IST)
తెలుగు రాష్ట్రాలలో విభజన అనంతరం నిరుద్యోగుల సమస్య పెరిగిపోతుంది. నోటిఫికెషన్స్ ఉండవు, ఉన్నా ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో తెలియదు, లేదా అసలు నోటిఫికెషన్స్ విడుదల ఉంటుందో లేదో కూడా తెలియదు. వీటన్నిటితో నిరుద్యోగులు తమకు ప్రభుత్వ ఉద్యోగాల సాధన చేయక ముందే వయసు దాటిపోతుందేమో అనే భయాందోళనలతో ఉన్నారు.

దానిని చల్లబరిచేందుకు అప్పుడప్పుడు ఆయా నోటిఫికెషన్స్ ను అనిసరించి  వయోపరిమితి పెంచుకుంటూ వస్తున్నారు. సహజంగా ఒక సాధారణ దరఖాస్తు దారుడు వయసు 30 ఉండాలి, అది తాజాగా 32కు పెంచుతున్నట్టు ఆంధ్రా ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల మానవ వనరుల పై శాసనసభలో జరిగిన చర్చల సందర్భంగా ఈ విషయం పై నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. లాక్ డౌన్ సహా పలు అడ్డంకులతో పోటీ పరీక్షలకు దూరంగా ఉండాల్సి వచ్చింది..దానిని అనుగుణంగా అభ్యర్థులు ఎవరూ నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అంటే ఇక ఇతర వర్గాల వారి విషయానికి వస్తే ఈ వయస్సు సడలింపు మరింతగా ఉండవచ్చు. వీరిలో దిగువ తరగతివారికి ఒక రకంగా, ఎక్స్ సర్వీస్ వారికి ఇంకోరకంగా మరింత వయోపరిమితి పెంచినట్టే. ఇలా పెంచుకుంటూ పోవటం ప్రస్తుతానికైతే ప్రభుత్వం ప్రకారం ఉద్యోగార్థులు కోసమే అయినప్పటికీ, ఒక స్థాయిలో ఇది రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న వాడు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి.

కొన్ని ఉద్యోగాలకు సాధారణ అభ్యర్థి వయసు 42 వరకు ఉంటుంది. అంటే ఇక మిగిలిన వర్గాల వారు ఏ వయసు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది స్పష్టంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వాలు వారి తప్పులను దాచుకోవడానికి ఇష్టానికి నిర్ణయాలు చేస్తున్నారు కానీ, వాటి వలన చాలా సార్లు భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఏ ప్రభుత్వమైనా కేవలం అప్పటికి గడిస్తే చాలు అన్నట్టే నిర్ణయాలు చేయడం సరికాదు. దీనితోనే అసలు సమస్యలు ప్రారంభం అవుతున్నాయి.

ఇకనైనా దీనిని గమయించుకొని, శాశ్వత పరిష్కారాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తే, అసలైన అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. లేదంటే ఎప్పటికి అతుకులు వేసుకుంటూ ఇప్పటికి బ్రతికి బయటపడితే చాలు భగవంతుడా అన్నట్టే ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు