Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త చనిపోయాడు.. విరహం తట్టుకోలేక ఐదేళ్ళు.. పరిచయమైతే శృంగారం...?

Advertiesment
భర్త చనిపోయాడు.. విరహం తట్టుకోలేక ఐదేళ్ళు.. పరిచయమైతే శృంగారం...?
, సోమవారం, 22 జులై 2019 (22:35 IST)
మొగుడు చనిపోయి ఐదు సంవత్సరాలు. ఒంటరి మహిళ. కూలి పని చేస్తూ జీవించేది. తన కోర్కె తీరాలంటే కనిపించిన వ్యక్తిని తీసుకెళ్ళి ఒకరోజు ఎంజాయ్ చేసి ఆ తరువాత వదిలేయడం. ఇదంతా ఐదు సంవత్సరాలుగా జరుగుతోంది. తాను అనుకున్నదంతా సాఫీగా జరుగుతోందని అనుకునేలోపే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
 
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కలపల్లి గ్రామంలో సుశీలమ్మ ఉంటోంది. ఈమెకు సొంత ఇల్లు ఉంది. పిల్లలు లేరు. ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో భర్త చనిపోయాడు. కూలి పని చేసుకుంటూ ఈమె జీవనం సాగిస్తుండేది.
 
అయితే ఆమె తన కోర్కెలను తీర్చుకునేందుకు తనతో పాటు పనిచేసేవారు.. తన బంధువులు.. ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా అందరితో శృంగారం చేయడం అలవాటుగా మార్చుకుంది. అంతేకాదు మద్యం కూడా సేవించేది. ఇలా ఆమె ఐదు సంవత్సరాల పాటు బాగానే అందరినీ మేనేజ్ చేస్తూ వచ్చింది.
 
కానీ గత వారంరోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడు కూలి పనిచేసేందుకు సుశీలమ్మ పనిచేసే చోటికే వచ్చాడు. అతనితో సుశీలమ్మ చనువు పెంచుకుంది. అతన్ని తీసుకుని ఏకాంతంగా గడిపాలని నిర్ణయించుకుంది. తన ఇంటిలో తెలిసిపోతుందని.. పలమనేరు పట్టణంలోని లాల్ బహదూర్ నగర్‌కు వెళ్ళింది. ఇల్లు అద్దె ఉన్న బోర్డు చూసి అద్దెకు కావాలని యజమాని చెంగమ్మను కోరింది.
 
అయితే సుశీలమ్మ వాలకం చూసి చెంగమ్మకు అనుమానం వచ్చింది. ఇల్లు అద్దెకు ఇచ్చేది లేదని చెప్పింది. అయితే తమకు ఎవరూ లేరని, తామిద్దరం భార్యాభర్తలిద్దరమని చెప్పింది. ఈరోజు రాత్రికి వరండాలో పడుకునేందుకు అవకాశం ఇవ్వమని కోరింది. దీంతో చెంగమ్మ సరేనని చెప్పి ఇంటిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
 
రాత్రి ఇద్దరూ కలిసి మద్యం పీకలదాకా సేవించారు. చెంగమ్మ ఇల్లు చివరలో ఉండటంతో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి సుశీలమ్మను కోర్కె తీర్చమన్నాడు. అయితే సుశీలమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఆరుబయట వద్దని వారించింది. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు ఆమెను బండరాయితో దారుణంగా కొట్టి చంపేసి వెళ్ళిపోయాడు. ఉదయం చెంగమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే సుశీలమ్మ రక్తపు మడుగులో ఉంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. సుశీలమ్మ గురించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్ల ఏనుగును చంపేసిందని విద్యుత్ స్తంభాన్ని నుజ్జునుజ్జు చేసిన తల్లి ఏనుగు...