Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న అచ్యుతరావు

Advertiesment
అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న అచ్యుతరావు
, శనివారం, 26 ఫిబ్రవరి 2022 (22:24 IST)
జర్మనీకి చెందిన అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం (ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ) నుండి బొప్పన అచ్యుతరావు గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన అచ్యుతరావు సమాజా సేవా విభాగంలో అందించిన వినూత్న సేవలకు గాను విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 

 
బెంగుళూరు సమీపంలోని హోసూరులో శనివారం జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సంస్ధ కులపతి డాక్టర్ కిమ్ నుండి బొప్పన అచ్యుతరావు డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దుబాయ్‌లో రియల్టర్‌గా మంచి విజయాలను నమోదు చేసుకున్న బొప్పన తన స్వగ్రామం పెదపాలపర్రుకు విభిన్న రూపాలలో సేవలు అందించారు.

 
తన తండ్రి బొప్పన బాబూరావు పేరిట గ్రామంలో నూతనంగా పంచాయితీ కార్యాలయాన్ని నిర్మించి, ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నానితో ప్రారంభింప చేసారు. గ్రామస్ధులకు అండగా ఉంటూ విద్యార్ధుల ఉన్నత విద్య అవసరాలకు ఆర్ధిక సాయం చేయటమే కాక, అత్యవసర సమయాలలో రహదారుల నిర్మాణం, దేవాలయాల జీర్ణోద్ధరణ వంటి అంశాలలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు.

 
గ్రామంలో ఏ అభివృద్ది  కార్యాక్రమం చేపట్టాలన్న ఇతోధిక ఆర్ధిక సాయం అందించి తనవంతు సేవాతత్పరతను చాటుకుంటూ ఉండేవారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన శాంతి రాయబారి డాక్టర్ పరిన్ సోమని ముఖ్యఅతిధిగా హాజరుకాగా, శాంతి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్ చెల్లాదురై, రిజిస్ట్రార్ డాక్టర్ గోపీ కన్నన్, అన్నామలై యూనివర్శిటీ నుండి అచార్య అంబ్రోస్ తదితరులు పాల్గొన్నారు. బొప్పన అచ్యుతరావుకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయటం పట్ల గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ అభినందనలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు రాలే సమస్యలను సమస్యలను పరిష్కరించడంలో హిమాలయ...