Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవినీతి రొచ్చులో సీఐ బాల‌కృష్ణ‌... ఈయ‌న అక్ర‌మ ఆస్తులు రూ.20 కోట్లు!

విశాఖ నగర కమిషనరేట్‌ పరిధిలోని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సి.ఐ. కె.వి.బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. మూడో పట్టణ క్రైం సీఐ కె.ఎస్‌.ఎన్‌.కొండ పట్టుబడిన ఉదంతాన్ని నగరవాసులు ఇ

Advertiesment
CI Balakrishna
, గురువారం, 23 జూన్ 2016 (17:21 IST)
విశాఖ నగర కమిషనరేట్‌ పరిధిలోని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సి.ఐ. కె.వి.బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. మూడో పట్టణ క్రైం సీఐ కె.ఎస్‌.ఎన్‌.కొండ పట్టుబడిన ఉదంతాన్ని నగరవాసులు ఇంకా మరువక ముందే మరో సి.ఐ. పట్టుబడటంతో నగర పోలీసుల అవినీతి గుట్టురట్టవుతోంది. హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడిగా పోలీసు శాఖలో ప్రవేశించిన సీఐ బాలకృష్ణ చివరకు అవినీతి ఆరోపణలతో జైలు పాలవ్వాల్సిన దుస్థితి తలెత్తింది. ఆయన వ్యవహారశైలిని చూసిన అనిశా అధికారులు నివ్వెరపోతున్నారు.
 
న‌గర కమిషనరేట్‌లోని నాలుగో పట్టణ సి.ఐ. బాలకృష్ణపై అవినీతి నిరోధ‌క శాఖ దాడుల్లో భారీఎత్తున అక్రమ ఆదాయంతో దొరికిపోవడం నివ్వెరపరుస్తోంది. ఒకింత సౌమ్యుడిగా పేరున్న ఆయన ఇంత సంపాదించారా? అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలి తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తోంది. పి.ఎం.పాలెం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ వెనుక సందులో మూడంతస్తుల భవనం, దానికి అత్యంత సమీపంలోనే మరో మూడంతస్తుల వాణిజ్య సముదాయం ఉండటం విశేషం. ఆయన అత్త పేరు మీద కూడా రూ.40 లక్షల విలువైన ఆస్తులుండటం, ఆమె గృహిణి కావడంతో ఆ ఇంటిని బాలకృష్ణే కొనుగోలు చేసి ఆమె పేరుపై పెట్టినట్లు భావిస్తున్నారు. 
 
నరవలో మూడు స్థలాలు, తాళ్లవలసలో స్థలం, విజయనగరంలో ఇల్లు, దుగ్గివలసలో తొమ్మిది ఎకరాల భూమి, 25 తులాల బంగారం, మూడు కేజీల వెండి తదితరాలన్నింటి పుస్తక విలువ రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే వాటి మార్కెట్‌ విలువ మాత్రం సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆయన మామ రమణ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశారు. తండ్రి అప్పలరాము పోలీసు శాఖలోనే హెడ్ కానిస్టేబుల్‌గా చిరుద్యోగాలు చేసిన నేపథ్యంలో అధికారికంగా ఆ స్థాయిలో ఆస్తులు సమకూర్చుకోవడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని అనిశా అధికారులు తేల్చి చెబుతున్నారు. 
 
విజయనగరంలో బాలకృష్ణ తండ్రి ఇంటిని ఇటీవలి సంవత్సరాల్లోనే కూల్చివేసి దాని స్థానంలో వాణిజ్య సముదాయం కట్టినట్లు కూడా అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. పి.ఎం.పాలెంలోని ఇంటి ముందు ప్రభుత్వ స్థలంలో బాలకృష్ణ రెండు రేకుల షెడ్లు నిర్మించారు. ఒక షెడ్డులో భారీగా విలువైన కలప, దుంగలు దొరకడంతో  ఏసీబీ అధికారులు కూడా కంగుతిన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ మోడల్ ఖండీల్ మతపెద్దతో క్యూట్ సెల్ఫీ... మతపెద్దకు మైండ్ బ్లాంక్... పోస్టు పాయే...