పాక్ మోడల్ ఖండీల్ మతపెద్దతో క్యూట్ సెల్ఫీ... మతపెద్దకు మైండ్ బ్లాంక్... పోస్టు పాయే...
పాక్ హాటెస్ట్ మోడల్ ఖండీల్ బలోచ్ అంటే పాకిస్తాన్ దేశంలో తెలియని మనిషి ఉండడు. ఇప్పుడీ అమ్మడు అంతర్జాతీయంగా పలు విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, పనులు చేస్తూ పాపులర్ అయిపోతోంది. ఆమధ్య అనుష్క శర్మను వదిలేయ్... నేను రెడీ అంటూ విరాట్ కోహ్లికి ఆఫర్ కూడా ఇ
పాక్ హాటెస్ట్ మోడల్ ఖండీల్ బలోచ్ అంటే పాకిస్తాన్ దేశంలో తెలియని మనిషి ఉండడు. ఇప్పుడీ అమ్మడు అంతర్జాతీయంగా పలు విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, పనులు చేస్తూ పాపులర్ అయిపోతోంది. ఆమధ్య అనుష్క శర్మను వదిలేయ్... నేను రెడీ అంటూ విరాట్ కోహ్లికి ఆఫర్ కూడా ఇచ్చింది ఈ సెక్సిణి. తాజాగా ఇప్పుడు సెల్ఫీతో ఓ మతపెద్దకు దిమ్మతిరిగే షాక్కొట్టింది.
అసలేమి జరిగిందయా అంటే... పాక్ మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావిని ఇఫ్తార్ విందుకు ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచింది ఈ అమ్మడు. అక్కడ టైట్ ప్యాంటుతో, టాప్‌తో సెల్ఫీ స్టిక్ పట్టుకుని గది అంతా కలియతిరుగుతూ మతపెద్దను తీయగా మాట్లాడుతూ మతపెద్దను మాటలతో బుక్ చేసేసింది. అంతేకాదు... ఆయన సోఫాలో కూర్చుంటే ఆయనకు అతుక్కుపోయినట్లు కూర్చోవడమే కాకుండా ఆయన తలపై ఉన్న టోపీని కూడా పెట్టేసుకుంది.
ఆరోజు జరిగినవన్నీ పూసగుచ్చినట్లు మొత్తం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసేసింది. వ్యవహారం బయటకు రావడంతో పాకిస్తాన్ దేశంలో దుమారం రేగింది. పవిత్ర రంజాన్ మాసంలో మహిళతో ఈ సెల్ఫీలేమిటంటే ఆయనను మందలించడమే కాకుండా మత పెద్ద పదవి నుంచి పీకేసారు. మత విషయాలను నేర్చుకుంటా రమ్మని ఆమె నన్ను ఆహ్వానించిందని చెప్పినా వారు దాన్ని పట్టించుకోనేలేదు. పాపం... సెల్ఫీ దెబ్బంటే అబ్బే మరి.