Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్ డెమోగ్రాఫిక్ బయోమెట్రిక్ డేటా అప్ డేట్ చేసుకోవాలి!

ఆధార్ డెమోగ్రాఫిక్  బయోమెట్రిక్ డేటా అప్ డేట్  చేసుకోవాలి!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (14:06 IST)
ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలు, సబ్సిడీ ప్రయోజనాలు,పెన్షన్లు, ఉపకార వేతనాలు, సామాజిక ప్రయోజనాలు, బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, టాక్సేషన్ సేవలు, విద్య, ఉపాధి, ఆరోగ్య మొదలగు వివిధ రకాల సేవలకు ఆధార్ తోడ్పడుతుందని ప్రజలు తమ తమ ఆధార్ డెమోగ్రాఫిక్  బయోమెట్రిక్ డేటా ఖచ్చితంగా అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య సూచించారు.
 
 
  
మంత్రి పేర్నినాని శుక్రవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ, పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. తొలుత  స్థానిక సుందరయ్యనగర్ కు చెందిన శొంఠి నాగమణి మంత్రికి తన సమస్య చెప్పింది. తన భర్త కొద్ది కాలం క్రితం చనిపోయారని  రేషన్ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులతో పాటు తన భర్త రాజేశ్వరరావు పేరు కార్డులో ఉందని తన భర్త పేరు తొలగించక పోవడంతో తనకు ఏడాది నుంచి వితంతు పింఛన్ రావడం లేదని ఆమె వాపోయింది. 
 
 
అలాగే స్థానిక  బచ్చుపేటకు చెందిన బొర్రా సత్యనారాయణ అనే వృద్ధుడు మంత్రిని కలిసి  తన సోదరికి పింఛన్ రావడం లేదని చెప్పారు. స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి అయిన‌ మీరు మీ సోదరిని రేషన్ కార్డులో కలిపారని, ఆమె పేరును రేషన్ కార్డు నుంచి వేరు చేయడానికి కొద్ది సమయం పడుతుందని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధార్‌ కార్డులో తప్పులను సరిచేసుకునేందుకు రేషన్‌ కార్డు, ఓటరు కార్డు, పిల్లల సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ లను సంబంధిత సిబ్బందికి అందజేయాలన్నారు. డిక్లరేషన్‌ ఫారాలను నింపి ఇస్తే పిన్‌ నెంబర్‌ ఆధారంగా కార్డులను క్రమబద్ధీకరిస్తారన్నారు. 
 
 
ప్రభుత్వం ఏర్పాటుచేసిన మార్పులు చేర్పుల కేంద్రాల వద్దకు వెళ్లి సంబంధిత పత్రాలు చూపించి మార్పులు చేసుకోవచ్చని మంత్రి పేర్ని నాని వివరించారు. బయోమెట్రిక్‌ కార్డుల్లో తప్పులు, మార్పులకు ఇదే పద్ధతిని పాటించాలని అన్నారు. స్థానిక జవ్వారుపేటకు చెందిన పువ్వుల ఏసు బాబు మంత్రిని కలిసి తాను బి టెక్  సివిల్ చదివేనని ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అలాగే చిలకలపూడికి చెందిన జొన్నలగడ్డ దుర్గా భవాని,  నాగిడి రూత్ అనే యువతులు మంత్రిని కలిసి డిగ్రీ చదివిన తమకు ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలని అభ్యర్ధించారు.
 
 
గూడూరు మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన సత్యం తన  మాతృమూర్తిని కోల్పోయినట్లు ,పండ్లకొట్టు చిన్ని కుమారుడు కృష్ణ చనిపోయారని దుర్వార్త తన కార్యాలయానికి రావడంతో మంత్రి పేర్ని నాని సందర్శకులతో మాట్లాడుతూ, తాను ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు ప్రజల సమస్యలను వింటానని చెప్పారు. అనంతరం మృతి చెందినవారి పార్థివ దేహాలను సందర్శించి కడసారి వారికీ నివాళులను అర్పించేందుకు మంత్రి హడావిడిగా అక్కడకు  ప్రయాణమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..