Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేసే అవకాశం ఉందట?

భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆ రోజున ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజ‌ర్‌లో నుంచే సందేశ‌మివ్వాల‌ని సూచ

ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేసే అవకాశం ఉందట?
, శుక్రవారం, 29 జులై 2016 (14:57 IST)
భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆ రోజున ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజ‌ర్‌లో నుంచే సందేశ‌మివ్వాల‌ని సూచించాయి. ఈ ముప్పు గతంతో పోల్చితే ఇపుడు మరింత ఎక్కువైందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి. 
 
వాస్తవానికి ప్రధాని పగ్గాలను నరేంద్ర మోడీ చేపట్టిన తర్వాత గ‌త రెండేళ్లుగా సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టి ఎలాంటి ర‌క్ష‌ణ గోడ‌లు లేకుండా ఎర్ర‌కోట‌పై నుంచి ప్ర‌సంగిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ప‌రిస్థితి వేరుగా ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. కాశ్మీర్ అల్ల‌ర్లు, దేశంలోకి చొర‌బాట్లు పెరిగిపోవ‌డ‌మ‌న్న కార‌ణాలే కాదు.. డ్రోన్ల ద్వారా కూడా మోడీపై దాడి జ‌రిగే ప్ర‌మాద‌ముంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో భ‌ద్ర‌తాధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్ దాడులు పెరిగిపోవడం కూడా ఈ ముప్పుకు ఓ కారణంగా ఉంది. 
 
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హ‌త్య త‌ర్వాత స్వ‌ాతంత్ర్య దినోత్స‌వాల్లో ప్ర‌ధాని ప్ర‌సంగాల‌కు బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజ‌ర్ల‌ను వాడుతున్న విషయం తెల్సిందే. అయితే మోడీ వ‌చ్చాక ఆ సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న‌పెట్టారు. రెండేళ్లుగా స్పాట‌ర్స్‌, క‌మాండోస్ సాయంతో మాన‌వ క‌వ‌చాన్ని ర‌క్ష‌ణగా ఉంచుతున్నారు. కానీ, ఈ దఫా స్వ‌ాతంత్ర్య దినోత్స‌వాల‌కు క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని నిర్ణయించారు. వ్యూహాత్మ‌క ప్ర‌దేశాల్లో ఇప్ప‌టికే క‌మాండోలు, స్పాట‌ర్స్‌ను రంగంలోకి దింపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు కట్నంగా ఇవ్వలేదనీ 'తలాక్' చెప్పాడు.. కానీ పెళ్లి చేసుకోకుండా షరతూ విధించాడు.. ఎందుకు?