కారు కట్నంగా ఇవ్వలేదనీ 'తలాక్' చెప్పాడు.. కానీ పెళ్లి చేసుకోకుండా షరతూ విధించాడు.. ఎందుకు?
వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా ప్రచారం జరుగుతున్నా... ఈ పిశాచి మాత్రం సమాజాన్ని వీడిపోయేలా కనిపించడం లేదు. తాజాగా ఓ వరుడు.. తనకు కట్నం కింద కారు ఇవ్వలేదన్న కోపంతో వివాహమైన 2 గంటలకే తలాక్ చెప్పే
వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా ప్రచారం జరుగుతున్నా... ఈ పిశాచి మాత్రం సమాజాన్ని వీడిపోయేలా కనిపించడం లేదు. తాజాగా ఓ వరుడు.. తనకు కట్నం కింద కారు ఇవ్వలేదన్న కోపంతో వివాహమైన 2 గంటలకే తలాక్ చెప్పేశాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కన్నీటిపర్యంతమైందా యువతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
మీరట్‌కు సమీపంలోని దహా గ్రామానికి చెందిన మొహిసినా అనే యువతికి.. ఆ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్ పూర్ వాసి మహ్మద్ ఆరిఫ్‌తో పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ముందుగా అనుకున్న ప్రకారం యువతి కుటుంబ సభ్యులు కట్నకానుకలను సిద్ధం చేశారు.
అయితే పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు తనకు కట్నంగా కారు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేశాడు. వివాహం అనంతరం ఈ విషయమై గొడవపడి పెళ్లికూతురుకు ఆవేశంగా తలాక్ చెప్పేశాడు. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. దీంతో వారంతా పంచాయతీ పెట్టి.. వధువు కుటుంబానికి రూ.2.5 లక్షలు ఇవ్వాలని తీర్మానించారు.
దీంతో షాక్‌కు గురైన వరుడు.. ఆ సొమ్ము చెల్లిస్తాను గానీ.. ఆ యువతి మూడేళ్ళ పాటు మరో పెళ్లి చేసుకోరాదన్న షరతు విధించారు. ఈ షరతు విన్న పంచాయతీ పెద్దలకు నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత తలాక్ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది.