Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలను గురుకులంలో చేర్చకండి.. నీలిచిత్రాలు చూపించి.. బాలుడిపై నెలపాటు లైంగిక దాడి

బండారుపల్లి బాలుర గురుకులంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గురుకులంలో సెల్‌ఫోన్లకే తావు లేదన్న సంగతి తెలిసిందే. అయితే గురుకులంలో ఉన్న బాలుడిపై ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు విద్యార్థులు నెలరోజుల ప

Advertiesment
9th class boy harrased by co-students in Bandarupalli gurukulam
, బుధవారం, 23 నవంబరు 2016 (12:56 IST)
బండారుపల్లి బాలుర గురుకులంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గురుకులంలో సెల్‌ఫోన్లకే తావు లేదన్న సంగతి తెలిసిందే. అయితే గురుకులంలో ఉన్న బాలుడిపై ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు విద్యార్థులు నెలరోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. సెల్ ఫోన్‌లో నీలిచిత్రాలు చూపిస్తూ ఆ బాలుడిని లైంగికంగా హింసించారు. ఆండ్రాయిడ్ ఫోనులో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తూ.. నీలిచిత్రాల వెబ్‌సైట్లను ఓపెన్‌చేసిన 9వ తరగతి విద్యార్థులు రోజూ చూసేవారు. ఆ దృశ్యాలు వారి మనస్సులో విషబీజాలను నాటాయి. 
 
రాత్రి వేళ అకృత్యం సాయంత్రం భోజనం చేసిన తర్వాత స్టడీ అవర్స్‌ అనంతరం విద్యార్థులంతా డార్మెటరీ రూంలో తరగతుల వారిగా నిద్రిస్తారు. కానీ, 6వ తరగతి చదువుతున్న ఓ బాలున్ని లైంగిక కోర్కెలు తీర్చాల్సిందిగా వేధింపులకు గురిచేశారు. నీలిచిత్రాల్లో ఉన్న విధంగా ప్రవర్తిస్తూ ఆరుగురు విద్యార్థులు సుమారు నెలరోజులపాటు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 
 
దసరా సెలవులు రావడంతో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఎప్పుడూ చురుగ్గా కనిపించే బాధిత బాలుడు సెలవులు పూర్తయిన తర్వాత తిరిగి గురుకులానికి వచ్చినప్పటినుంచి ముభావంగా ఉండటంతో గమనించిన హౌస్‌మాస్టర్‌ అక్టోబర్‌ 28న విచారించగా తనపై జరిగిన అకృత్యాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. ఆసమయంలో పరీక్షలు జరుగుతుండగా మిగతా విద్యార్థులపై ప్రభావం చూపుతుందని భావించిన ప్రిన్సిపాల్‌ సూర్యనారాయణ స్వామి వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. 
 
గతనెల 31న విచారణ జరపగా వాస్తవాలు బయటపడ్డాయి. ఆరుగురికి టీసీలు.. బాలునిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆరుగురు విద్యార్థులను విచారించిన ప్రిన్సిపాల్‌ వారు తప్పును ఒప్పుకోవడంతో తల్లిదండ్రులను పిలిపించారు. వారి సమ్మతంమేరకు వారికి టీసీలు ఇచ్చి ఇంటికి పంపించారు. బాధిత విద్యార్థిని కూడా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... గురుకులంతో పాటు పిల్లలు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేలా వదిలేయకండని.. తల్లిదండ్రుల కనుసన్నల్లోనే పిల్లల్ని పెంచాలని హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ బాత్రూమ్ కథ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు... బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలతో నిర్మాణం!