Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ బాత్రూమ్ కథ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు... బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలతో నిర్మాణం!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారో లేదో తెలియదు కానీ.. తాను, తన కుటుంబ సభ్యుల భద్రతపై మాత్రం ఆయన ప్రత్యేక జాగ్రత్త

Advertiesment
Bulletproof bathroom
, బుధవారం, 23 నవంబరు 2016 (12:32 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారో లేదో తెలియదు కానీ.. తాను, తన కుటుంబ సభ్యుల భద్రతపై మాత్రం ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన తన పర్యవేక్షణలో ఓ కొత్త ఇంటిని కూడా నిర్మించుకున్నారు. ఈ ఇల్లు నిర్మాణంలో గట్టి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. 
 
సుమారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో నిర్మించిన బాత్‌ రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్‌‌ అద్దాలతో నిర్మించడం గమార్హం. స్నానాల గదులకు ఏర్పాటుచేసిన కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను బిగించారు. అలాగే, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కోసం నిర్మించిన బెడ్రూంలకు కూడా అత్యంత క్వాలిటీ ఉన్న దళసరి గాజు ఫలకాలను అమర్చారు. 
 
వీటి విలువ దాదాపు రూ.లక్షల్లోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జెడ్ ప్లస్ కేటగిరీని తలదన్నేలా రక్షణ చర్యలు కొత్త నివాసం నిర్మాణంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటలెజెన్స్ వర్గాల సూచనల మేరకే ఇలా బుల్లెట్ ప్రూఫ్ చర్యలను తీసుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు కేసీఆర్ నూతన గృహ ప్రవేశం చేయనున్న విషయం తెలిసిందే. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
కాగా, బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. ఆర్ అండ్ బీ విభాగం రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 3 బ్లాక్‌లుగా ఈ నిర్మాణాలు చేపట్టింది. దాదాపు వెయ్యిమందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మించారు. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలను సేకరించి ఇక్కడ పెంచే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగించారు. తొమ్మిది నెలల్లోనే ఈ భవనాన్ని పూర్తి చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నో ఇన్‌కమ్ టాక్స్... త్వరలో ప్రధాని మోదీ శుభవార్త...? దేశం కేరింతలు కొట్టదూ...!!