కొత్త ఏడాది జనవరిలో 94.29 శాతం పింఛన్ల పంపిణీ చేసిన ఏపీ సర్కార్
పింఛన్ల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం పేదలకు భరోసానిచ్చింది. సామాజిక భద్రత పథకంలో భాగంగా నిరుపేదలకు చెల్లించే పింఛన్ల విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. నోట్ల రద్దు తర్వాత ఎదురైన సవాళ్లను అధిగమించిన ప్రభుత్వం ఈ నెల పి
పింఛన్ల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం పేదలకు భరోసానిచ్చింది. సామాజిక భద్రత పథకంలో భాగంగా నిరుపేదలకు చెల్లించే పింఛన్ల విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. నోట్ల రద్దు తర్వాత ఎదురైన సవాళ్లను అధిగమించిన ప్రభుత్వం ఈ నెల పింఛన్ల పంపిణీకి ముందుగా ప్రణాళికాయుతంగా వ్యవహరించి పేదలకు పింఛన్ల మొత్తాన్ని వేగంగా అందించగలిగింది. జనవరి నెలలో 42 లక్షల 74 వేల 662 మందికి పింఛన్లు మంజూరు చేయగా... ఇందుకుగాను రూ. 457 కోట్ల 37 లక్షల 65 వేలు కేటాయించారు. 16 తారీఖు సాయంత్రం 5 గంటల వరుకు 40 లక్షల 30 వేల 585 మందికిగాను అంటే... 94.29 శాతం మందికి రూ. 429 కోట్ల 67 లక్షల 62 వేల రూపాయల మొత్తాన్ని చెల్లించారు.
మొత్తం పింఛన్ దారుల్లో వృధ్యాప్య పింఛన్లు 20 లక్షల 69 వేల 723 మందికి మంజూరు చేయగా... ఇందుకుగాను రూ. 216 కోట్ల 3 లక్షల 69 వేలు కేటాయించారు. ఇప్పటి వరకు 19 లక్షల 55 వేల 749 మంది రూ. 203 కోట్ల 15 లక్షల 96 వేల రూపాయల మొత్తాన్ని పింఛన్ల రూపంలో అందుకున్నారు. వితంతు పింఛన్లు అందుకుంటున్నవారిలో 15 లక్షల 43 వేల 740 మంది ఉండగా... రూ. 160 కోట్ల 71 లక్షల 4 వేల రూపాయలను కేటాయించగా... ఇప్పటి వరకు 14 లక్షల 54 వేల 342 మంది రూ. 151 కోట్ల 4 లక్షల 24 వేల రూపాయలను అందుకున్నారు. వికలాంగుల పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల 36 వేల 879 మందికి పింఛన్లు అందిస్తోంది. ఇందుకుగాను రూ. 67 కోట్ల 89 లక్షల 41 వేల మొత్తాన్ని కేటాయించారు. ఇప్పటి వరకు 4 లక్షల 99 వేల 820 మంది రూ. 63 కోట్ల 14 లక్షల 27 వేల రూపాయలను అందుకున్నారు.
ఇక చేనేత కార్మికులు 71 వేల 839 మంది ఉండగా వీరికి వరుసగా రూ. 7 కోట్ల 45 లక్షల 41 వేలు చెల్లిస్తుండగా... 68 వేల 690 మంది చేనేత కార్మికులు, 95.62 శాతం మంది రూ. 7 కోట్ల 10 లక్షల 28 వేల మొత్తాన్ని పింఛన్ల రూపంలో పొందారు. కల్లు గీత కార్మికులు 13,333 మంది ఉండగా రూ. ఒక కోటి 36 లక్షల 62 వేలు మొత్తాన్ని చెల్లిస్తుండగా... కల్లుగీత కార్మికులు 12 వేల 836 మంది కోటీ 31 లక్షల 39 వేల మొత్తాన్ని 96.17 శాతం మంది జనాభా పింఛన్ల రూపంలో తీసుకున్నారు. రాష్ట్రంలోని 39 వేల 148 మంది ఎయిడ్స్ పేషంట్లకు రూ. 3 కోట్ల 91 లక్షల 48 వేలు మంజూరు చేస్తుండగా... 39,148 మందికి గాను మొత్తం రూ 3 కోట్ల 91 లక్షల 48 వేల మొత్తాన్ని పింఛన్ల రూపంలో అందించారు. ఈ కేటగిరిలో వందకు వంద శాతం మంది పింఛన్లను అందుకున్నారు.
నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వెయ్యి, ఐదు వందల రూపాయల నొట్ల రద్దు నిర్ణయం తర్వాత పింఛన్ల చెల్లింపు విషయంలో ఎలాంటి అశ్రద్ధను సహించేది లేదని ముఖ్యమంత్రి బ్యాంకర్లకు, అధికారులకు తేల్చి చెప్పడంతో ఈ నెల పింఛన్ల చెల్లింపు వ్యవహారాన్ని అధికారులు వేగవంతం చేశారు. ముందుగా నగదు అందుబాటులో ఉంచుకొని పింఛన్ దారులందరికీ నగదును పంపిణీ చేశారు. పింఛన్ దారులకు ఇబ్బందులు లేకుండా చెల్లింపు చేశారు. తాజాగా జన్మభూమి సభల్లో కొత్తగా మూడున్నర లక్షల మందికి పింఛన్లను సైతం ప్రభుత్వం కేటాయించింది.